Guntur Kaaram: శ్రీలీలతో మాస్ స్టెప్పులు కుమ్మేసిన మహేశ్ బాబు... 'గుంటూరు కారం' నుంచి హై ఓల్టేజ్ సాంగ్ విడుదల

 Kurchi Madathapetti song from Mahesh Babu Guntur Kaaram out now
  • మహేశ్ బాబు, త్రివిక్రమ్ కలయికలో గుంటూరు కారం
  • కుర్చీ మడతపెట్టి సాంగ్ రిలీజ్ చేసిన చిత్రబృందం
  • తమన్ బాణీలకు రామజోగయ్య సాహిత్యం
  • అభిమానులను ఉర్రూతలూగిస్తున్న మాస్ మసాలా సాంగ్
మహేశ్ బాబు గుంటూరు కారం నుంచి సిసలైన మాస్ సాంగ్ రిలీజైంది. కుర్చీ మడతపెట్టి అంటూ సాగే ఈ హైఓల్టేజ్ సాంగ్ పూర్తి లిరికల్ వీడియోను చిత్రబృందం తాజాగా విడుదల చేసింది. నిన్న ఈ పాటకు సంబంధించిన ప్రోమోతోనే మహేశ్ అభిమానుల్లో భారీ హైప్ నెలకొంది. ఇప్పుడు పూర్తి పాట రావడంతో ఫ్యాన్స్ ఆనందానికి హద్దుల్లేకుండా పోయాయి. 

యంగ్ బ్యూటీ శ్రీలీలతో మహేశ్ బాబు ఉత్సాహంగా స్టెప్పులేసిన తీరు మాస్ మసాలా రేంజ్ లో ఉర్రూతలూగిస్తోంది. తమన్ బాణీలకు రామజోగయ్యశాస్త్రి సాహిత్యం అందించారు. "రాజమండ్రి రాగమంజరి... మా అమ్మ పేరు తెలవనోళ్లు లేరు మేస్తిరీ... సోకులాడి స్వప్న సుందరీ... నీ మడతచూపు మాపటేల మల్లెపందిరీ" అంటూ ఆడియన్స్ ను కిర్రెక్కించేలా రామజోగయ్య తన కలానికి పనిచెప్పారు. 

హారిక అండ్ హాసిని క్రియేషన్స్ బ్యానర్ పై మహేశ్ బాబు, త్రివిక్రమ్ శ్రీనివాస్ కాంబినేషన్ లో వస్తున్న గుంటూరు కారం చిత్రం 2024 జనవరి 12న సంక్రాంతి కానుకగా ప్రేక్షకుల ముందుకు వస్తోంది.
Guntur Kaaram
Kurchi Madathapetti
Mass Song
Mahesh Babu
Sree Leela
Trivikram Srinivas
Thaman
Ramajogaiah Sastry

More Telugu News