Rohit Sharma: విరాట్‌ను అభినందించిన రోహిత్ శర్మ.. వీడియో ఇదిగో

Rohit Sharma appriciates Virat Kohli in first test against south africa
  • సెంచూరియన్ టెస్టు రెండో ఇన్నింగ్స్‌లో రాణించిన కోహ్లీని ప్రశంసించిన హిట్‌మ్యాన్
  • డ్రెస్సింగ్ రూమ్‌కు వెళ్తున్న సమయంలో చప్పట్లతో స్వాగతించిన కెప్టెన్
  • భుజం తట్టి ప్రశంసించిన రోహిత్.. సోషల్ మీడియాలో వైరల్‌గా మారిన వీడియో
సెంచూరియన్ వేదికగా జరిగిన తొలి టెస్టు మ్యాచ్‌లో దక్షిణాఫ్రికా చేతిలో టీమిండియా ఘోర ఓటమిని చవిచూసింది. ఏకంగా ఇన్నింగ్స్, 32 పరుగుల తేడాతో పరాజయం పాలైన విషయం తెలిసిందే. ఎన్నో అంచనాలతో మ్యాచ్‌ను ఆరంభించినప్పటికీ భారత బ్యాటర్లు ఘోరంగా విఫలమయ్యారు. ముఖ్యంగా సెకండ్ ఇన్నింగ్స్‌లో దారుణంగా ఆడారు. కేవలం 131 పరుగులకే ఆలౌట్ అయ్యారు. ఇందులో స్టార్ బ్యాట్స్‌మెన్ విరాట్ కోహ్లీ ఒక్కడివే 76 పరుగులు ఉన్నాయి. మిగతా బ్యాటర్లు చతికిల పడిన చోట కోహ్లీ పరాలేదనిపించాడు. ఒకవైపు వికెట్లు పడుతున్నా నియంత్రణతో బ్యాటింగ్ చేశాడు. ఈ స్టార్ బ్యాటర్ సాధించిన 76 పరుగుల్లో 12 ఫోర్లు, 1 సిక్సర్ ఉన్నాయి. దీంతో విరాట్ నైపుణ్యానికి అందరూ ఫిదా అయ్యారు.

మిగతా బ్యాటర్లు విఫలమైన పిచ్‌పై విరాట్ రాణించడంతో కెప్టెన్ రోహిత్ శర్మ కూడా ఆశ్చర్యపోయాడు. కింగ్ విరాట్‌ను అభినందించాడు. ఔట్ అయ్యాక డ్రెస్సింగ్ రూమ్‌కు వెళ్లే సమయంలో విరాట్‌ను హిట్‌మ్యాన్‌ ప్రశంసించాడు. చప్పట్లు కొడుతూ స్వాగతించాడు. డ్రెస్సింగ్‌ రూమ్‌లోకి వెళ్తున్న కోహ్లీని శెభాష్ అంటూ భుజం తట్టాడు. ఇందుకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. కాగా ప్రపంచ కప్ 2023 ఫైనల్‌లో ఓటమి తర్వాత రోహిత్, కోహ్లీ ఇద్దరూ తిరిగి ఈ టెస్టు మ్యాచ్‌లో అంతర్జాతీయ క్రికెట్ మొదలుపెట్టిన విషయం తెలిసిందే.
Rohit Sharma
Virat Kohli
south africa Vs India
Cricket
Team India

More Telugu News