Lunar eclipse: కొత్త సంవత్సరం 2024లో తొలి చంద్రగ్రహణం ఎప్పుడంటే..!

first lunar eclipse of the new year 2024 happed to be on march 25
  • మార్చి 25న ఏర్పడనున్న ఖగోళ ఘట్టం
  • సెప్టెంబర్ 18న సంభవించనున్న రెండవ చంద్రగ్రహణం
  • ఈ రెండూ భారత్‌లో కనిపించే అవకాశం లేదంటున్న ఖగోళశాస్త్రం

మరొక్క రోజులో క్యాలెండర్ మారిపోతుంది. 2023కు ముగింపు పలికి కొత్త ఏడాది 2024లోకి అడుగుపెట్టబోతున్నాం. ఈ నూతన ఏడాదిలో తొలి చంద్రగ్రహణం మార్చి 25న(సోమవారం) ఏర్పడనుందని ఖగోళశాస్త్రం చెబుతోంది. చంద్రగ్రహణం ఉదయం 10.41 గంటలకు మొదలై మధ్యాహ్నం 3.01 గంటలకు ముగుస్తుంది. దాదాపు 4 గంటల పాటు కొనసాగనుంది. అదే రోజు హోలీ పండుగ వచ్చింది. అయితే ఈ చంద్రగ్రహణం భారత్‌లో కనిపించదు. ఆస్ట్రేలియా, ఆఫ్రికా, ఉత్తర అమెరికా, దక్షిణాఫ్రికా, అట్లాంటిక్ మహాసముద్రం, పసిఫిక్ మహాసముద్రం, ఇతర అనేక ప్రాంతాల్లో కనువిందు చేయనుంది. 

ఇక 2024 సంవత్సరంలో రెండవ చంద్రగ్రహణం సెప్టెంబర్ 18న సంభవించనుంది. ఉదయం 6.12 గంటలకు ప్రారంభమై ఉదయం 10.17 గంటల వరకు కొనసాగుతుంది. ఈ చంద్రగ్రహణం కూడా ఇండియాలో కనిపించదు. యూరప్, ఉత్తర, దక్షిణ అమెరికా, దక్షిణ, ఉత్తర ఆఫ్రికా, అట్లాంటిక్ మహాసముద్రం, ఆర్కిటిక్ మహాసముద్రంలోని ప్రాంతాల్లో కనిపించనుంది.

  • Loading...

More Telugu News