Mahesh Babu: మహేశ్ బాబు 'గుంటూరు కారం' నుంచి మాస్ మసాలా సాంగ్... ప్రోమో విడుదల

Mass Masala song promo from Mahesh Babu Guntur Kaaram movie released
  • మహేశ్ బాబు, త్రివిక్రమ్ కాంబోలో గుంటూరు కారం
  • కుర్చీ మడతపెట్టి సాంగ్ విడుదలకు రంగం సిద్ధం
  • నేడు ప్రోమో... రేపు పూర్తి లిరికల్ సాంగ్  రిలీజ్
  • సంక్రాంతి బరిలో ఘాటెక్కించేందుకు సిద్ధమవుతున్న 'గుంటూరు  కారం'
సూపర్ స్టార్ మహేశ్ బాబు నటిస్తున్న తాజా చిత్రం 'గుంటూరు కారం' నుంచి ఒక మాస్ మసాలా సాంగ్ విడుదలకు రంగం సిద్ధమైంది. 'కుర్చీ మడతపెట్టి' అంటూ సాగే ఈ గీతం తాలూకు ప్రోమోను చిత్రబృందం నేడు విడుదల చేసింది. హీరో మహేశ్ బాబు ఈ ప్రోమో వీడియోను తన సోషల్ మీడియా ఖాతాలో పంచుకున్నారు. ఈ పాట పూర్తి లిరికల్ వీడియో రేపు రిలీజ్ కానుంది. 

మహేశ్ బాబు, త్రివిక్రమ్ శ్రీనివాస్ కాంబినేషన్ లో వస్తున్న ఈ చిత్రంపై భారీ అంచనాలు ఉన్నాయి. హారిక అండ్ హాసిని క్రియేషన్స్ బ్యానర్ పై తెరకెక్కుతున్న 'గుంటూరు కారం' చిత్రంలో మహేశ్ బాబు సరసన యువ కథానాయిక శ్రీలీల నటిస్తోంది. మీనాక్షి చౌదరి మరో కథానాయిక. 

ఈ చిత్రానికి తమన్ సంగీతం అందిస్తున్నాడు. కాగా, ఇటీవల విడుదలైన ఓ పాట (ఓ మై బేబీ) విషయంలో అసంతృప్తిగా ఉన్న మహేశ్ ఫ్యాన్స్ కు ఈ 'కుర్చీ మడతపెట్టి' సాంగ్ ప్రోమో ఉత్సాహం కలిగిస్తుందనడంలో సందేహం లేదు! ఫాస్ట్ బీట్ కు మహేశ్, శ్రీలీల కాలు కదిపిన తీరు అభిమానులను కిర్రెక్కించేలా ఉంది. 

'గుంటూరు కారం' చిత్రం 2024 సంక్రాంతి సందర్భంగా జనవరి 12న ప్రేక్షకుల ముందుకు వస్తోంది.
Mahesh Babu
Kurchi Madathapetti
Promo
Mass Masala Song
Trivikram Srinivas
Guntur kaaram
Thaman
Tollywood

More Telugu News