Ambati Rambabu: అంబటి రాంబాబును కచ్చితంగా ఓడిస్తాం: వైసీపీ అసమ్మతి నేతలు

We will defeat Ambati Rambabu says Dissident leaders of YCP
  • సొంత పార్టీ నేతల నుంచి అంబటికి నిరసన సెగ
  • విజయసాయిరెడ్డి నివాసం ముందు ఆందోళన
  • సత్తెనపల్లి టికెట్ స్థానికులకే ఇవ్వాలని డిమాండ్

ఏపీ మంత్రి అంబటి రాంబాబును తొలి నుంచి కూడా టీడీపీ, జనసేన నేతలు టార్గెట్ చేస్తున్న సంగతి తెలిసిందే. ఎన్నికలు ముంచుకొస్తున్న వేళ ఆయనకు సొంత పార్టీ శ్రేణుల నుంచి కూడా అసమ్మతి సెగ తగులుతోంది. సత్తెనపల్లి నియోజకవర్గ వైసీపీ అసమ్మతి నేతలు ఆయనకు వ్యతరేకంగా నిరసన వ్యక్తం చేస్తున్నారు. అంబటి వద్దు... జగనన్నే ముద్దు అని నినాదాలు చేస్తూ ఏకంగా రాజ్యసభ సభ్యుడు విజయసాయిరెడ్డి నివాసం ముందు వారు ఆందోళన చేపట్టారు. ప్రతి గ్రామంలో కూడా వైసీపీలో రెండు ముఠాలను ఏర్పాటు చేసి కక్షలకు కారణమయ్యారంటూ వారు అంబటిపై మండిపడ్డారు. సొంత పార్టీ నేతలను అరెస్ట్ చేయించి గడప గడపకు కార్యక్రమాన్ని అంబటి చేసుకోవాల్సి వచ్చిందని అన్నారు. అంబటికి టికెట్ ఇస్తే కచ్చితంగా ఓడించి తీరుతామని హెచ్చరించారు. స్థానికులకే ఈసారి సత్తెనపల్లి టికెట్ ఇవ్వాలని డిమాండ్ చేశారు. 

  • Loading...

More Telugu News