Jharkhand: మహిళపై ఎస్పీ, డీసీపీ డ్రైవర్ల లైంగికదాడి.. రెండు గంటల్లోనే నిందితుల అరెస్ట్

Jharkhand woman gangraped drivers of SP and DCP arrested
  • ఝార్ఖండ్‌లోని పాలము జిల్లాలో ఘటన
  • మహిళను బెదిరించి అఘాయిత్యం
  • చెబితే చంపేస్తామని బెదిరింపు
ఝార్ఖండ్‌లోని పాలము జిల్లాలో 32 ఏళ్ల మహిళపై ఇద్దరు సీనియర్ పోలీసు అధికారులకు చెందిన డ్రైవర్లు లైంగిక దాడికి పాల్పడ్డారు. నిందితుల్లో ఒకతను పాలము డిప్యూటీ కమిషనర్ డ్రైవర్ ధర్మేంద్రకుమార్ (30) కాగా, రెండో నిందితుడిని పాలము ఎస్పీ డ్రైవర్ ప్రకాశ్‌కుమార్ (40)గా గుర్తించి అరెస్ట్ చేశారు. బాధిత మహిళ ఫిర్యాదు ప్రకారం ఈ ఘటన గురువారం ఉదయం జరిగింది. 

మొబైల్ రీచార్జ్ కోసం బాధితురాలు దల్తోంగంజ్ రైల్వే ష్టేషన్‌కు వెళ్తుండగా నిందితులు ఇద్దరు ఆమెతో మాటలు కలిపారు. ఆ తర్వాత ఆమెను బలవంతంగా రెసిడెంట్స్ క్వార్టర్స్‌కు తీసుకెళ్లి లైంగికదాడికి పాల్పడ్డారు. విషయాన్ని ఎవరికైనా చెబితే చంపేస్తామని హెచ్చరించారు. ఆ తర్వాత బాధిత మహిళ టౌన్ పోలీస్ స్టేషన్‌లో ఫిర్యాదు చేయగా నిందితులను పోలీసులు రెండు గంటల్లోనే అరెస్ట్ చేశారు. లైంగికదాడి ఘటనను పాలము ఎస్పీ రీష్మా రమేశన్ నిర్ధారించారు. నిందితులపై కఠిన చర్యలు తీసుకుంటామని తెలిపారు.
Jharkhand
Gang Rape
Crime News
Palamu District

More Telugu News