Chandrababu: కుప్పం టీడీపీ నేత త్రిలోక్ ను పరామర్శించిన చంద్రబాబు... ఫొటోలు ఇవిగో!

Chandrababu visits Kuppam TDP leader Trilok in Bengaluru
  • ఇటీవల చంద్రబాబు అరెస్ట్
  • నిరసనల సందర్భంగా జరిగిన ప్రమాదంలో త్రిలోక్ కు తీవ్రగాయాలు
  • ప్రస్తుతం బెంగళూరులో ఉన్న త్రిలోక్
  • త్రిలోక్ కుటుంబానికి ధైర్యం చెప్పిన చంద్రబాబు
కుప్పం టీడీపీ సమన్వయ కమిటీ సభ్యుడు త్రిలోక్ ను టీడీపీ అధినేత చంద్రబాబు బెంగళూరులో పరామర్శించారు. ఇవాళ కుప్పం పర్యటనకు వెళ్లిన చంద్రబాబు అంతకుముందు బెంగళూరులో పర్యటించారు. 

చంద్రబాబు అరెస్ట్ నేపథ్యంలో జరిగిన నిరసనల సందర్భంగా జరిగిన ప్రమాదంలో త్రిలోక్ తీవ్రంగా గాయపడ్డాడు. త్రిలోక్ ఓ ఆసుపత్రిలో చికిత్స పొంది, ప్రస్తుతం బెంగళూరులో ఉంటున్నాడు. ఇప్పటికీ ఆయన పూర్తిగా కోలుకోలేదు. 

ఈ నేపథ్యంలో, త్రిలోక్ ను పరామర్శించిన చంద్రబాబు అతడికి ధైర్యం చెప్పారు. ఈ సందర్భంగా చంద్రబాబు త్రిలోక్ కుటుంబ సభ్యులతోనూ మాట్లాడారు. అతని కుటుంబానికి అండగా ఉంటామని భరోసా ఇచ్చారు.
Chandrababu
Trilok
Bengaluru
TDP Leader
Kuppam

More Telugu News