Harish Rao: రోడ్‌ సైడ్ బండిపై టిఫిన్‌ చేసిన ఎమ్మెల్యే హరీశ్ రావు... వీడియో ఇదిగో

MLA Harish Rao take food at road side tiffin centre
  • సిద్దిపేట హౌసింగ్ బోర్డులో రోడ్డుపై ఆగి ఇడ్లీ తిన్న మాజీ మంత్రి
  • యువతతో కలిసి టిఫిన్ తిన్న హరీశ్ రావు
  • యువతతో సరదాగా ముచ్చటించిన హరీశ్ రావు

మాజీ మంత్రి, సిద్దిపేట ఎమ్మెల్యే తన్నీరు హరీశ్ రావు రోడ్ సైడ్ బండిపై ఫలహారాన్ని ఆస్వాదించారు. గురువారం ఆయన సిద్దిపేటలోని హౌసింగ్ బోర్డులో రోడ్డుపక్కన ఆగి, అక్కడి ఇడ్లీ రుచి చూశారు. టిఫిన్ సెంటర్ వద్ద ఉన్న ఇతర కస్టమర్లతో కలిసి ఆయన సరదాగా ముచ్చటించుకుంటూ ఫలహారాన్ని ఆరగించారు. హరీశ్ రావుతో మాట్లాడేందుకు అక్కడున్న వారు ఆసక్తిని కనబరిచారు. టిఫిన్ పూర్తయ్యాక కూడా... కాసేపు అక్కడే ఉన్న యువతతో ఇంటరాక్ట్ అయ్యారు.  దీనిని టీన్యూస్ తెలుగు ట్వీట్ చేసింది. 'ఇడ్లీ బాగుంది... సూపర్ టేస్ట్...!! రోడ్‌ సైడ్‌లో టిఫిన్‌ చేసిన హరీష్ రావు' అని ట్వీట్ చేసింది.

  • Loading...

More Telugu News