intermediate: తెలంగాణలో ఫిబ్రవరి 28వ తేదీ నుంచి ఇంటర్ పరీక్షలు

Inter Exams from 28 feb in Telangana
  • ఫిబ్రవరి 1 నుంచి 15వ తేదీ వరకు ప్రాక్టికల్స్
  • ఫిబ్రవరి 28 నుంచి మార్చి 19 వరకు థీరీ పరీక్షలు
  • రెండు సెషన్లలో ప్రాక్టికల్స్ ఉంటాయన్న ఇంటర్ బోర్డు
ఇంటర్ బోర్డు గురువారం ఇంటర్మీడియేట్ పరీక్షల షెడ్యూల్‌ను విడుదల చేసింది. తెలంగాణలో ఇంటర్మీడియేట్ పరీక్షలు ఫిబ్రవరి 28వ తేదీ నుంచి మార్చి 19వ తేదీ వరకు జరగనున్నాయి. ఇంటర్ ప్రాక్టికల్ పరీక్షలు... జనరల్ మరియు వొకేషనల్ కోర్సులు ఫిబ్రవరి 1వ తేదీ నుంచి 15వ తేదీ వరకు నిర్వహించనున్నారు. రెండో శనివారం, ఆదివారాల్లో ఈ పరీక్షలు జరుగుతాయని ఇంటర్ బోర్డు అధికారులు తెలిపారు. రెండు సెషన్లలో ప్రాక్టికల్స్ జరుగుతాయని... ఉదయం 9 గంటల నుంచి మధ్యాహ్నం 12 గంటల వరకు మొదటి సెషన్, మధ్యాహ్నం 2 గంటల నుంచి సాయంత్రం 5 గంటల వరకు రెండో సెషన్ పరీక్షలు ఉంటాయని వెల్లడించారు. ఇంటర్ ఫస్టియర్ విద్యార్థులకు ఇంగ్లీష్ ప్రాక్టికల్ పరీక్ష ఫిబ్రవరి 16వ తేదీన ఉంటుందని వెల్లడించారు.
intermediate
inter
Telangana

More Telugu News