praja palana: ప్రభుత్వమే ఉచితంగా అందిస్తోన్న అభయహస్తం ఫామ్స్... రూ.50కి విక్రయిస్తున్న దళారులు

Mediators sell Abhaya Hastham forms for rs 50
  • నేటి నుంచి ప్రారంభమైన ప్రజాపాలన - అభయహస్తం దరఖాస్తుల స్వీకరణ
  • అభయ హస్తాన్ని క్యాష్ చేసుకునే ప్రయత్నం చేస్తోన్న దళారులు
  • ఒక్కో దరఖాస్తు ఫామ్‌కు రూ.50 నుంచి రూ.100 వరకు విక్రయం

నేటి నుంచి తెలంగాణలో ప్రజాపాలన - అభయహస్తం దరఖాస్తుల స్వీకరణ ప్రారంభమైంది. ఆరు గ్యారెంటీలకు సంబంధించి దరఖాస్తుదారులకు ప్రభుత్వమే దరఖాస్తు పత్రాలను అందిస్తోంది. ఆశావహులకు అధికారులు దరఖాస్తు పత్రాలను అందిస్తున్నారు. వివిధ పథకాల కోసం ప్రజాపాలనకు ప్రజల నుంచి అనూహ్య మద్దతు లభిస్తోంది. అయితే దీనిని కొంతమంది క్యాష్ చేసుకునే ప్రయత్నాలు చేస్తున్నారు. అభయహస్తం దరఖాస్తు పత్రాలను విక్రయిస్తున్నారు. ఒక్కో ఫామ్‌ను రూ.50 నుంచి రూ.100 వరకు విక్రయిస్తున్నారు. అభయహస్తం దరఖాస్తు పత్రాలను ప్రభుత్వమే ఆశావహులకు ఉచితంగా అందిస్తోంది. కానీ దళారులు ఫామ్స్‌ను విక్రయించడంతో ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. తెలంగాణ వ్యాప్తంగా నేటి నుంచి జనవరి 6వ తేదీ వరకు అభయహస్తం దరఖాస్తుల స్వీకరణ ఉండనుంది.

  • Loading...

More Telugu News