Chandrababu: నా కొత్త నినాదం థింక్ గ్లోబల్లీ.. యాక్ట్ గ్లోబల్లీ: చంద్రబాబు

My new slogan is Think globally and act globally says Chandrababu
  • బెంగళూరు టీడీపీ ఫోరం సమావేశంలో పాల్గొన్న చంద్రబాబు
  • తెలుగు జాతిని నెంబర్ వన్ చేయడమే అందరి లక్ష్యమని వ్యాఖ్య
  • అందరం కలిసి ఏపీని అభివృద్ధి పథంలోకి తీసుకెళ్దామని పిలుపు
రైతు బిడ్డలు, కార్మికుల బిడ్డలు ఐటీ రంగంలోకి రావాలని ఆరోజు తాను ఆకాంక్షించానని, అందుకే ఐటీకి పెద్ద పీట వేశానని టీడీపీ అధినేత చంద్రబాబు అన్నారు. ఇప్పుడు ప్రపంచంలో ఎక్కడకు వెళ్లినా ప్రతి నలుగురు ఐటీ నిపుణుల్లో ఒకరు తెలుగు వారు ఉంటున్నారని చెప్పారు. ఆరోజు తాను టెక్నాలజీ గురించి మాట్లాడితే నవ్వారని... కానీ ఇప్పుడు అదే టెక్నాలజీ మన సంపద పెరగడానికి దోహదపడుతోందని తెలిపారు. తన తాజా నినాదం థింక్ గ్లోబల్లీ, యాక్ట్ గ్లోబల్లీ అని చెప్పారు. ప్రపంచ స్థాయిలో మనం ఆలోచించాల్సిన అవసరం ఉందని చెప్పారు. బెంగళూరులో తెలుగుదేశం పార్టీ ఫోరం నిర్వహించిన కార్యక్రమంలో చంద్రబాబు పాల్గొన్నారు. 

ఈ సందర్భంగా చంద్రబాబు మాట్లాడుతూ... తాను ఆరోజు విజన్ 2020 గురించి మాట్లాడితే చాలా మంది నవ్వారని... ఆరోజు తన మాట విన్నవారు ఇప్పుడు ఉన్నత స్థానంలో ఉన్నారని చెప్పారు. అమ్మాయిలు చదువుకోవాలంటూ తాను ప్రోత్సాహించానని... ఇప్పుడు భర్తల కంటే భార్యలు ఎక్కువ సంపాదించే అవకాశం ఉందని తెలిపారు. అందరూ తనను ఆదరించారని, అభిమానించారని, తాను చెప్పింది విన్నారని అందరికీ ధన్యవాదాలు చెపుతున్నానని చెప్పారు. తెలుగు జాతిని నెంబర్ వన్ చేయడమే మనందరి లక్ష్యమని అన్నారు. 

ప్రతి ఒక్కరూ నెట్ వర్క్ ను పెంచుకోవాలని... ప్రతిరోజు 20 మందికి ఫోన్లు చేసి మాట్లాడాలని.. ఓట్లు ఉన్నాయో లేదో చెక్ చేసుకోవాలని చెప్పాలని, వచ్చే ఎన్నికలు ఎంత ముఖ్యమో వివరించాలని చంద్రబాబు సూచించారు. రాష్ట్ర అభివృద్ధి కోసం తనకు సలహాలను ఇవ్వాలని చెప్పారు. అందరం కలిసి ఏపీని మళ్లీ అభివృద్ధి పథంలోకి తీసుకెళ్దామని అన్నారు. పేదరికం లేని సమాజాన్ని చూడాలనేదే తన జీవిత ఆశయమని చెప్పారు. రాష్ట్రంలో అన్ని వ్యవస్థలు భ్రష్టుపట్టాయని అన్నారు.
Chandrababu
Telugudesam
Bengaluru

More Telugu News