Sharad Pawar: అయోధ్య రామ మందిరం ప్రారంభోత్సవానికి నన్ను పిలవలేదు: శరద్ పవార్

I didnt get invitation for Ayodhya Ram Mandir opening says Sharad Pawar
  • జనవరి 22న అయోధ్యలో విగ్రహ ప్రతిష్ట
  • మోదీ సహా హాజరుకానున్న 6 వేల మంది ప్రముఖులు
  • ఆహ్వానం అందితే అయోధ్యకు వెళ్లే విషయంపై ఆలోచిస్తానన్న పవార్

ఉత్తరప్రదేశ్ లోని అయోధ్య రామ మందిరం ప్రారంభోత్సవానికి అన్ని ఏర్పాట్లు శరవేగంగా జరుగుతున్నాయి. జనవరి 22న విగ్రహ ప్రతిష్ఠాపన కార్యక్రమం అంగరంగ వైభవంగా జరగనుంది. ఈ వేడుకకు హాజరు కావాలని కోరుతూ శ్రీ రామజన్మభూమి తీర్థ క్షేత్ర ట్రస్టు వివిధ రంగాల ప్రముఖులకు ఆహ్వానాలు పంపుతోంది. ప్రధాని మోదీ సహా 6 వేల మంది అతిథులు విగ్రహ ప్రాణప్రతిష్ట కార్యక్రమంలో పాల్గొననున్నారు. కీలక రాజకీయ నాయకులతో పాటు బౌద్ధ మతగురువు దలైలామా, పారిశ్రామిక దిగ్గజం ముఖేశ్ అంబానీ, పలువురు సినీ సెలబ్రిటీలు, క్రీడాకారులు హాజరుకానున్నారు. మరోవైపు, తనకు ఆహ్వానం అందలేదని ఎన్సీపీ అధినేత శరద్ పవార్ తెలిపారు. ఆహ్వానం అందితే అయోధ్యకు వెళ్లే విషయంపై ఆలోచిస్తానని చెప్పారు. రామ మందిరాన్ని బీజేపీ రాజకీయాలకు వాడుకుంటోందో? లేదో? చెప్పడం కష్టమని వ్యాఖ్యానించారు.

  • Loading...

More Telugu News