మరో సంస్థను సొంతం చేసుకున్న అదానీ గ్రూప్
- హల్వాద్ ట్రాన్స్ మిషన్ లిమిటెడ్ లో 100 శాతం వాటాను కొనుగోలు చేసిన అదానీ గ్రూప్
- టేకోవర్ చేసిన అదానీ ఎనర్జీ సొల్యూషన్స్ లిమిటెడ్
- టేకోవర్ వార్తలతో 3 శాతం పెరిగిన అదానీ ఎనర్జీ షేర్లు
టారిఫ్ బేస్డ్ కాంపిటీటివ్ బిడ్డింగ్ ప్రక్రియ ద్వారా అదానీ గ్రూప్ ఈ ప్రాజెక్టును సొంతం చేసుకుంది. సుమారు 301 కిలోమీటర్ల మేర ట్రాన్స్ మిషన్ ప్రాజెక్ట్ ను నిర్మించేందుకు అదానీ ఎనర్జీ సొల్యూషన్స్ దాదాపు రూ. 3 వేల కోట్ల రూపాయల పెట్టుబడులు పెట్టనుంది. ఈ ప్రాజెక్టులో 765 కిలోవాట్ల హల్వాద్ స్విచ్చింగ్ స్టేషన్ నిర్మాణం కూడా ఉంటుంది.