Tesla Robo Attack: రోబో దాడిలో టెస్లా ఇంజినీర్‌కు తీవ్ర గాయాలు!

Tesla Robot Attacks Engineer Trail Of Blood On Factory Floor Report
  • రెండేళ్ల క్రితం జరిగిన ఘటన తాజాగా వెలుగులోకి
  • సాఫ్ట్‌వేర్ అప్‌డేట్ సందర్భంగా అకస్మాత్తుగా ప్రమాదం
  • టెకీని రోబో కింద అదిమిపెట్టడంతో అతడి వీపుకు తీవ్ర గాయాలు

అమెరికాలోని టెక్సాస్ రాష్ట్రంలోగల టెస్లా గీగా ఫ్యాక్టరీలోని ఓ రోబో కారణంగా సాఫ్ట్‌వేర్ ఇంజినీర్ ఒకరు తీవ్రంగా గాయపడినట్టు వెలుగులోకి వచ్చింది. గీగా ఫ్యాక్టరీలో ప్రమాదాలపై అమెరికా ఆక్యూపేషనల్ సేఫ్టీ అండ్ హెల్త్ అడ్మినిస్ట్రేషన్ విభాగానికి అందిన నివేదికలో (ఇంజ్యురీ రిపోర్టు) ఈ విషయం బయటపడింది.

రెండేళ్ల క్రితం ఆస్టిన్‌లోని టెస్లా గీగా ఫ్యాక్టరీలో ఈ ఘటన జరిగింది. అల్యూమినియం పలకలను కోసి కారు విడిభాగాలను తయారు చేసేందుకు ఈ రోబోలను వినియోగిస్తారు. రోబోల సాఫ్ట్‌వేర్‌ను ఇంజినీర్ అప్‌డేట్ చేస్తున్న సమయంలో ఈ ప్రమాదం జరిగింది. సాధారణంగా ఇలాంటి సమయాల్లో రోబోలను ఇనాక్టివ్ చేస్తారు. అయితే, ఘటన జరిగిన రోజున ఓ రోబో ప్రమాదవశాత్తూ యాక్టివ్‌గా ఉంది. అప్‌డేట్ సమయంలో అది ఇంజినీర్‌ను కింద పడదోసి, అదిమిపెట్టి బంధించింది. రోబోకున్న పదునైన భాగాలు బాధితుడి వీపులోకి దిగబడ్డాయి. అతడి చేతికి కూడా త్రీవ గాయమైంది. ఫ్యాక్టరీ ఫ్లోర్‌ రక్తిసిక్తమైంది. ఈ ప్రమాదం మినహా 2021, 2022లో మరే ఇతర ప్రమాదాలు జరగలేదు. 

అయితే, ఫ్యాక్టరీలో భద్రతాపరమైన లోపాలు ఉన్నట్టు ఆ నివేదికలో తేలింది. టెక్సాస్‌లోని ఫ్యాక్టరీలో గతేడాది సగటున 21 మంది సిబ్బందిలో ఒకరు గాయాల పాలయ్యారని ఇంజ్యురీ రిపోర్టులో తేలిసింది. ఆటోమొబైల్ రంగంలో సగటు కంటే ఇది అధికం. కాగా, కంపెనీలో తరచూ భద్రతాపరమైన ఉల్లంఘనలు జరుగుతున్నాయని గతంలో కొందరు టెస్లా మాజీ సిబ్బంది ఆరోపించారు. నిర్మాణం, నిర్వహణ, ఇతర కార్యకలాపాల్లో తగినన్ని జాగ్రత్తలు లేకపోవడంతో ఉద్యోగులకు రిస్క్ ఎక్కువవుతోందని తెలిపారు. 2022 నాటి ఓ ఘటనలో ద్రవస్థితిలో ఉన్న అల్యూమినియంలో నీరు పడటంతో పెద్ద విస్ఫోటనం సంభవించింది.

  • Loading...

More Telugu News