Narendra Modi: ప్రధానికి కానుకగా గోశాల నిర్వాహకుల ప్రత్యేక తివాచీ

Chhattisgarh goshala makes speacial carpet with cow dung as gift for modi
  • మోదీ కోసం 14 కిలోల బరువున్న తివాచీని సిద్ధం చేసిన ఖైరాగఢ్ గోశాల 
  • సౌమ్య కామధేను జాతికి చెందిన గోవు మూత్రం, పేడతో తివాచీ తయారీ
  • త్వరలో ప్రధాని నివాసానికి తివాచీని పంపనున్న గోశాల నిర్వాహకులు
ఛత్తీస్‌గఢ్‌లోని ఖైరాగఢ్‌లోగల మనోహర్ గోశాల నిర్వాహకులు ప్రధాని నరేంద్ర మోదీ కోసం ప్రత్యేక బహుమతి సిద్ధం చేశారు. గోమూత్రం, పేడతో తయారీ చేసిన తివాచీని ఆయనకు త్వరలో బహుమతిగా ఇవ్వనున్నారు. ఆయుర్వేద పితామహుడు చరకుడి స్ఫూర్తితో ఈ తివాచీని రూపొందించినట్టు వెల్లడించారు. గోల్డెన్ బుక్ ఆఫ్ రికార్డ్స్‌లో చోటు సాధించిన సౌమ్య కామధేను జాతికి చెందిన ఆవుపేడ, మూత్రాన్ని తివాచీ తయారీకి వినియోగించారు. ‘‘ఆధ్యాత్మికంగా ఉన్నత శిఖరాలను చేరుకోడానికి చరకుడు ఇలాంటి తివాచీని వాడారు. దీని బరువు 14 కిలోలు. త్వరలోనే ఢిల్లీలోని ప్రధాని నివాసానికి ఈ తివాచీని పంపుతాం’’ అని గోశాల మేనేజింగ్ ట్రస్టీ సాదం డాక్‌లియా తెలిపారు.
Narendra Modi
Chhattisgarh

More Telugu News