Bhadradri Kothagudem District: ఆర్టీసీ బస్సు డ్రైవర్‌పై ఆటోవాలాల దాడి

Autodriver attack bus driver in Bhadradri kothagudem
  • భద్రాద్రి కొత్తగూడెం జిల్లా కేంద్రంలో బుధవారం ఘటన
  • ఖమ్మం వెళుతున్న బస్సు పట్టణంలోని పోస్టాఫీసు వద్ద ఆగిన వైనం
  • వెంటనే సర్వీసు ఆటోల్లోని ప్రయాణికులంతా బస్సులోకి  
  • ఇది చూసి బస్సు డ్రైవర్‌పై ఆటో డ్రైవర్ల దాడి
ఆర్టీసీ బస్సు డ్రైవర్‌పై ఆటో డ్రైవర్లు దాడికి దిగిన ఘటన భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో బుధవారం వెలుగు చూసింది. ఖమ్మం వైపు వెళుతున్న బస్సు ఒకటి మధ్యాహ్నం కొత్తగూడెం పట్టణంలోని పోస్టాఫీస్ వద్దకు వచ్చి ఆగింది. దీంతో, అప్పటివరకూ సర్వీసు ఆటోల్లో కూర్చున్న ప్రయాణికులంతా దిగి బస్సులో ఎక్కేశారు. ఇదంతా చూసి ఆవేశానికి లోనైన నలుగురు ఆటోడ్రైవర్లు బస్సు డ్రైవర్ కె.నాగరాజుపై దాడి చేశారు. అతడిపై నీళ్లు చల్లుతూ దుర్భాషలాడారు. కండక్టర్‌తో పాటు ఇతర వాహనదారులు వారిని వారించే ప్రయత్నం చేసినా ఆటోవాలాలు వినిపించుకోలేదు. కాగా, ఈ ఘటనపై కొత్తగూడెం డిపో మేనేజర్..కొత్తగూడెం ఒకటో పట్టణ ఠాణాలో ఫిర్యాదు చేయడంతో పోలీసులు విచారణ ప్రారంభించారు.
Bhadradri Kothagudem District
Telangana

More Telugu News