Sunitha Laxma Reddy: అధికారులు ప్రోటోకాల్ పాటించడం లేదు: బీఆర్ఎస్ ఎమ్మెల్యే సునీతా లక్ష్మారెడ్డి

Sunitha Laxma Reddy talks about protocal issue in meetings
  • ఉమ్మడి మెదక్ జిల్లా కలెక్టర్లు, ఎస్పీలు, అధికారులు, ప్రజాప్రతినిధులతో మంత్రి కొండా సురేఖ సమీక్ష
  • ప్రజాపాలనపై సన్నాహక సమావేశంలో ప్రోటోకాల్ పాటించడం లేదని ఆరోపణ
  • సమావేశాలకు తమకు సమాచారం అందడం లేదని సురేఖ గమనించాలని విజ్ఞప్తి

ప్రజాపాలనపై సన్నాహక సమావేశంలో అధికారులు ప్రోటోకాల్ పాటించడం లేదని నర్సాపూర్ ఎమ్మెల్యే సునీతా లక్ష్మారెడ్డి ఆరోపించారు. రేపటి నుంచి నిర్వహించనున్న ప్రజాపాలన కార్యక్రమంపై ఉమ్మడి మెదక్ జిల్లా కలెక్టర్లు, ఎస్పీలు, ప్రజాప్రతినిధులు, అధికారులతో బుధవారం సమీక్ష సమావేశం నిర్వహించారు. ఈ సమావేశంలో మంత్రి కొండా సురేఖ, ఎమ్మెల్యేలు పాల్గొన్నారు. 

ఈ సందర్భంగా సునీతా లక్ష్మారెడ్డి మాట్లాడుతూ... సమావేశాలకు తమకు ఎలాంటి సమాచారం ఇవ్వడం లేదన్నారు. ఈ విషయాన్ని మంత్రి సురేఖ గమనించాలని కోరారు. సమావేశంలో దుబ్బాక ఎమ్మెల్యే కొత్త ప్రభాకర్ రెడ్డి పట్ల అధికారులు ప్రోటోకాల్ పాటించడం లేదన్నారు. ఈ విషయాన్ని ముఖ్యమంత్రి దృష్టికి తీసుకు వెళ్లాలన్నారు.

  • Loading...

More Telugu News