news year: నూతన సంవత్సర వేడుకల సందర్భంగా... సైబరాబాద్ పోలీసుల ఆంక్షలు

Cyberabad Police restrictions on New Year 2024 eve
  • 31 రాత్రి పది గంటల నుంచి 1వ తేదీ ఉదయం 5 గంటల వరకు ఔటర్, పీవీ ఎక్స్‌ప్రెస్ వే మూసివేత
  • విమానాశ్రయాలకు వెళ్లే వాహనాలను మాత్రమే అనుమతిస్తామని వెల్లడి
  • దుర్గం చెరువు కేబుల్ బ్రిడ్జి మూసివేత
2024 నూతన సంవత్సర వేడుకలకు సంబంధించి సైబరాబాద్ పోలీసులు ఆంక్షలు విధించారు. ఎవరికీ ఇబ్బందులు కలగకుండా న్యూఇయర్ వేడుకలు జరుపుకోవాలని సైబరాబాద్ పోలీసులు సూచించారు. ఈ నెల 31వ తేదీ రాత్రి పది గంటల నుంచి జనవరి 1 తేదీ వేకువజామున ఐదు గంటల వరకు ఔటర్ రింగ్ రోడ్డు, పీవీ ఎక్స్‌ప్రెస్ వే వంతెనను మూసివేస్తున్నట్లు తెలిపారు. కేవలం విమానాశ్రయాలకు వెళ్లే వాహనాలను మాత్రమే అనుమతించనున్నట్లు వెల్లడించారు.

శిల్ప లేఅవుట్, గచ్చిబౌలి, బయో డైవర్సిటీ, షేక్ పేట, మైండ్ స్పేస్, సైబర్ టవర్, ఫోరమ్ మాల్, జేఎన్టీయూ, ఖైత్లాపూర్, బాలానగర్ ఫ్లై ఓవర్లతో పాటు దుర్గం చెరువు తీగల వంతెనలను 31వ తేదీ రాత్రి పదకొండు గంటల నుంచి ఒకటో తారీఖు ఉదయం ఐదు గంటల వరకు మూసివేస్తున్నట్లు వెల్లడించారు. క్యాబ్, ఆటో డ్రైవర్లు తప్పనిసరిగా యూనిఫామ్ ధరించాలని సూచించారు. మద్యం తాగి వాహనాలు నడిపితే కఠిన చర్యలు తప్పవని హెచ్చరించారు.
news year
Telangana
Hyderabad

More Telugu News