YS Sharmila: వైఎస్సార్ తెలంగాణ అధ్యక్షురాలు షర్మిల కాంగ్రెస్‌లో చేరడంపై మాణిక్కం ఠాగూర్ స్పందన

Manikkam on YS Sharmila joining in Congress
  • షర్మిల కాంగ్రెస్‌లో చేరే అంశంపై ఖర్గే, రాహుల్ నిర్ణయం తీసుకుంటారని వెల్లడి
  • ఆమె పార్టీలో చేరితే అప్పగించే బాధ్యతలపై ఖర్గే నిర్ణయిస్తారన్న ఠాగూర్
  • వైఎస్ కూతురుగా ఆమెపట్ల గౌరవం ఉందన్న మాణిక్కం 
వైఎస్సార్ తెలంగాణ పార్టీ అధ్యక్షురాలు వైఎస్ షర్మిల కాంగ్రెస్ పార్టీలో చేరుతారనే ప్రచారం జోరుగా సాగుతోంది. ఆమె కాంగ్రెస్ పార్టీలో చేరుతారనే వార్తలపై ఆంధ్రప్రదేశ్ కాంగ్రెస్ పార్టీ వ్యవహారాల ఇంఛార్జ్ మాణిక్కం ఠాగూర్ స్పందించారు. ఏబీఎన్ ఛానల్ నిర్వహించిన ఓ కార్యక్రమంలో ఆయన స్పందిస్తూ... షర్మిల తమ పార్టీలో చేరే అంశంపై పార్టీ అగ్రనేత రాహుల్ గాంధీ, పార్టీ జాతీయ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే నిర్ణయాన్ని తీసుకుంటారని తెలిపారు. దివంగత వైఎస్ రాజశేఖరరెడ్డి కూతురుగా ఆమె అంటే తమకు గౌరవం ఉందన్నారు. షర్మిల పార్టీలో చేరడం... ఆమెకు అప్పగించే బాధ్యతలపై ఖర్గే నిర్ణయం తీసుకుంటారని స్పష్టం చేశారు. ఇటీవలి అసెంబ్లీ ఎన్నికలకు ముందు వరకు షర్మిల తెలంగాణలో కీలకంగా వ్యవహరించారు. అయితే చివరి నిమిషంలో పోటీ నుంచి తప్పుకొని కాంగ్రెస్ పార్టీకి మద్దతు పలికారు.
YS Sharmila
Congress
Telangana
Andhra Pradesh

More Telugu News