Virat Kohli: డబ్ల్యూటీసీలో రోహిత్ శర్మను వెనక్కి నెట్టిన విరాట్ కోహ్లీ

  • దక్షిణాఫ్రికాతో టెస్టులో తొలి ఇన్నింగ్స్ లో 38 పరుగులు చేసిన కోహ్లీ
  • డబ్ల్యూటీసీ సైకిల్ లో భారత్ తరఫున అత్యధిక పరుగుల వీరుడిగా రికార్డు
  • 57 ఇన్నింగ్స్ ల్లో 2,101 పరుగులు చేసిన కింగ్ కోహ్లీ
  • 42 ఇన్నింగ్స్ ల్లో 2,097 పరుగులు చేసిన రోహిత్ శర్మ
Virat Kohli edge past Rohit Sharma as leading run scorer for Team India in WTC

టీమిండియా బ్యాటింగ్ కింగ్ విరాట్ కోహ్లీ మరో ఘనత అందుకున్నాడు. వరల్డ్ టెస్టు చాంపియన్ షిప్ లో భారత్ తరఫున అత్యధిక పరుగుల వీరుడిగా నిలిచాడు. ఈ క్రమంలో కోహ్లీ... టీమిండియా కెప్టెన్ రోహిత్ శర్మను వెనక్కి నెట్టాడు. 

2019-25 డబ్ల్యూటీసీ సైకిల్ లో రోహిత్ శర్మ 42 ఇన్నింగ్స్ ల్లో 2,097 పరుగులు చేయగా... కోహ్లీ 57 ఇన్నింగ్స్ ల్లో 2,101 పరుగులు సాధించాడు. ప్రస్తుతం దక్షిణాఫ్రికాతో జరుగుతున్న తొలి టెస్టులో కోహ్లీ మొదటి ఇన్నింగ్స్ లో 38 పరుగులు చేశాడు. ఈ క్రమంలోనే రోహిత్ శర్మను అధిగమించాడు. 

ఈ జాబితాలో ఛటేశ్వర్ పుజారా (1,769), అజింక్యా రహానే (1,589), రిషబ్ పంత్ (1,575) తర్వాతి స్థానాల్లో ఉన్నారు.

More Telugu News