Vijaykanth: రోజులైనా గడవకముందే మళ్లీ ఆసుపత్రిలో చేరిన విజయ్‌కాంత్

Tamil Star Hero And DMDK Chief Vijaykanth Once Again Admitted In Hospital
  • గత కొంతకాలంగా అనారోగ్యంతో బాధపడుతున్న విజయ్‌కాంత్
  • ఇటీవలే ఆసుపత్రి నుంచి డిశ్చార్జ్
  • అంతలోనే మళ్లీ ఆసుపత్రిలో చేరిక
  • రెగ్యులర్ చెకప్ కోసమేనన్న కుటుంబ సభ్యులు
అనారోగ్యం నుంచి కోలుకుని ఆసుపత్రి నుంచి డిశ్చార్జ్ అయిన తమిళ స్టార్ హీరో, డీఎండీకే అధినేత విజయ్‌కాంత్ మరోమారు ఆసుపత్రిలో చేరారు. అయితే, ఆయన ఆసుపత్రికి వెళ్లింది రెగ్యులర్ చెకప్ కోసమేనని, రెండ్రోజుల్లో తిరిగి ఇంటికి చేరుకుంటారని కుటుంబ సభ్యులు చెప్తున్నారు. 70 సంవత్సరాల విజయ్‌కాంత్ గత కొన్నేళ్లుగా తీవ్ర అనారోగ్య సమస్యలతో బాధపడుతున్నారు. ఆయన భార్య ప్రేమలత. వీరికి ఇద్దరు కుమారులు ఉన్నారు. 

తమిళంలో వందలాది సినిమాల్లో నటించి స్టార్ హీరోగా గుర్తింపు తెచ్చుకున్న ‌విజయ్ కాంత్ కు తెలుగులోనూ మంచి ఫ్యాన్ ఫాలోయింగ్ ఉంది. కెప్టెన్ ప్రభాకర్ సినిమాతో ఆయన స్టార్ హీరోల సరసన చేరారు. 2015లో దేశీయ ముర్పోక్కు ద్రవిడ కళగం (డీఎండీకే) పేరుతో పార్టీ స్థాపించారు. అయితే, రాజకీయాల్లో అంతగా ఆయనకు కలిసి రాలేదు.
Vijaykanth
Kollywood
DMDK

More Telugu News