Revanth Reddy: మోదీతో భేటీ తర్వాత... సోనియా గాంధీతో రేవంత్ రెడ్డి సమావేశం

Revanth Reddy meets Sonia Gadhi after meeting with pm modi
  • ఢిల్లీలోని సోనియా నివాసానికి వెళ్లిన సీఎం రేవంత్ రెడ్డి
  • లోక్ సభ ఎన్నికలు, రాష్ట్ర అభివృద్ధిపై సోనియాతో చర్చ!
  • అంతకుముందే మల్లు భట్టితో కలిసి మోదీతో సమావేశమైన సీఎం
తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఏఐసీసీ అగ్రనాయకురాలు సోనియా గాంధీని కలిశారు. మంగళవారం సాయంత్రం ప్రధాని నరేంద్ర మోదీతో భేటీ అనంతరం ఆయన ఢిల్లీలోని తమ పార్టీ అగ్రనాయకురాలి నివాసానికి వెళ్లారు. ఈ సందర్భంగా సోనియాతో రానున్న లోక్ సభ ఎన్నికలు, తెలంగాణ రాష్ట్ర అభివృద్ధి అంశాలపై చర్చించినట్టు తెలుస్తోంది. అదే సమయంలో ప్రధాని నరేంద్ర మోదీతో జరిగిన భేటీకి సంబంధించిన వివరాలను సోనియా గాంధీకి వివరించారని తెలుస్తోంది. అంతకుముందు ఉప ముఖ్యమంత్రి మల్లు భట్టి విక్రమార్కతో కలిసి సీఎం రేవంత్ ప్రధాని మోదీని కలిశారు. రాష్ట్రానికి రావాల్సిన పెండింగ్ నిధులు, ఇతర ప్రాజెక్టులపై విజ్ఞప్తి చేశారు.
Revanth Reddy
Congress
Sonia Gandhi
Narendra Modi

More Telugu News