damodara rajanarasimha: తెలంగాణలో కొవిడ్ మరణం... స్పందించిన మంత్రి దామోదర రాజనర్సింహ

Minister Damodara Rajanarasimha on Covid death
  • కరోనాతో తెలంగాణలో ఎవరూ మరణించలేదని స్పష్టీకరణ
  • రాష్ట్రంలో కొవిడ్ మరణాలు ఇప్పటి వరకు నమోదు కాలేదన్న మంత్రి
  • ఉస్మానియాలో చనిపోయిన వారికి అనేక రకాల రోగాలు ఉన్నట్లు వెల్లడి

తెలంగాణలో కొవిడ్ కారణంగా ఎవరూ మరణించలేదని వైద్య ఆరోగ్య శాఖ మంత్రి దామోదర రాజనర్సింహ మంగళవారం స్పష్టం చేశారు. ఉస్మానియా ఆసుపత్రిలో ఇద్దరు వ్యక్తులు మృతి చెందగా, వారికి పరీక్షలు నిర్వహించగా కొవిడ్ పాజిటివ్ గా తేలింది. ఈ నేపథ్యంలో మంత్రి స్పందించారు. రాష్ట్రంలో కొవిడ్ మరణాలు ఇప్పటి వరకు నమోదు కాలేదన్నారు. ఉస్మానియా ఆసుపత్రిలో చనిపోయిన వారికి అనేక రకాల రోగాలు ఉన్నట్లు వైద్యులు గుర్తించినట్లు తెలిపారు. కొవిడ్ మరణం అని వార్తలు రావడంతో వైద్య ఆరోగ్య శాఖ ఉన్నతాధికారులతో మంత్రి మాట్లాడారు. రాష్ట్రంలో కరోనా కేసులు.. తదితర అంశాలపై వారిని అడిగి తెలుసుకున్నారు.

  • Loading...

More Telugu News