Gidugu Rudra Raju: ఏపీ కాంగ్రెస్ లోకి షర్మిల వస్తే మనస్పూర్తిగా ఆహ్వానిస్తాం: గిడుగు రుద్రరాజు

We will welcome YS Sharmila into AP Congress says Gidugu Rudra Raju
  • ఏపీ కాంగ్రెస్ బాధ్యతలను షర్మిలకు అప్పగిస్తారంటూ ప్రచారం
  • పార్టీ నిర్ణయాన్ని శిరసావహిస్తామన్న రుద్రరాజు
  • రేపు ఏపీ నేతలతో కాంగ్రెస్ హైకమాండ్ భేటీ

వైఎస్సార్టీపీ అధ్యక్షురాలు వైఎస్ షర్మిలను ఏపీ కాంగ్రెస్ అధ్యక్షురాలిగా నియమించబోతున్నారనే వార్త వైరల్ అవుతోంది. ఏపీ రాజకీయాల్లో ఆమె కీలక పాత్రను పోషించబోతున్నట్టు చెపుతున్నారు. ఈ నేపథ్యంలో ఏపీసీసీ అధ్యక్షుడు గిడుగు రుద్రరాజు స్పందిస్తూ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. షర్మిల ఏపీ కాంగ్రెస్ లోకి వస్తే ఆహ్వానిస్తామని ఆయన అన్నారు. పార్టీ హైకమాండ్ ఎలాంటి నిర్ణయం తీసుకున్నా తాము శిరసా వహిస్తామని చెప్పారు. రేపు ఢిల్లీలో ఏపీ కాంగ్రెస్ నేతలతో అధిష్ఠానం సమావేశమవుతోంది. ఏపీ ఎన్నికలు, ప్రస్తుత పార్టీ పరిస్థితి, పార్టీ బలోపేతం, భవిష్యత్ కార్యాచరణ తదితర అంశాలపై చర్చించనున్నారు. ఇదే సమయంలో షర్మిల అంశం కూడా ప్రస్తావనకు వచ్చే అవకాశం ఉంది.

  • Loading...

More Telugu News