Bigg Boss: బిగ్ బాస్ నిర్వాహకులకు నోటీసులు ఇచ్చిన జూబ్లీహిల్స్ పోలీసులు

Jubilee Hills police issus notices to Bigg Boss producers
  • బిగ్ బాస్ విన్నర్ పల్లవి ప్రశాంత్ ఇష్యూలో నోటీసులు
  • గత ఆదివారం అన్నపూర్ణ స్టూడియో వద్ద జరిగిన గొడవ
  • ఎండమోల్ షైన్ ఇండియా ప్రయివేట్ లిమిటెడ్‌‌కు పోలీసుల నోటీసులు
బిగ్ బాస్ నిర్వాహకులకు హైదరాబాద్‌లోని జూబ్లీహిల్స్ పోలీసులు సోమవారం నోటీసులు జారీ చేశారు. బిగ్ బాస్ సీజన్ - 7 తెలుగు ఫినాలే అనంతరం జరిగిన ఘర్షణకు సంబంధించి పోలీసులు నోటీసులు జారీ చేశారు. బిగ్ బాస్ యాజమాన్యం ఎండమోల్ షైన్ ఇండియా ప్రయివేట్ లిమిటెడ్‌కు ఈ నోటీసులను జారీ చేశారు. కాగా, గత ఆదివారం బిగ్ బాస్ ఫినాలే అనంతరం అన్నపూర్ణ స్టూడియో వద్ద జరిగిన గొడవ కారణంగా బస్సులు, పోలీస్ వాహనాలు ధ్వంసమయ్యాయి. దీనికి సంబంధించి పోలీసులు రెండు కేసులు నమోదు చేశారు. ఈ ఘటనలో ఇప్పటి వరకు 24 మందిని అరెస్ట్ చేశారు. బిగ్ బాస్ విన్నర్ పల్లవి ప్రశాంత్‌ను కూడా అరెస్ట్ చేశారు. అయితే ఆయనకు నాంపల్లి కోర్టు షరతులతో కూడిన బెయిల్ ఇవ్వడంతో రెండు రోజుల క్రితం విడుదలయ్యారు.
Bigg Boss
Telangana

More Telugu News