Gautam Gambhir: నాకో 2-3 కోట్లు ఇప్పించండి: గంభీర్‌ను వేడుకున్న టీవీ ప్ర‌జెంట‌ర్

  • ఐపీఎల్ లో రూ. 24.75 కోట్లకు అమ్ముడుపోయిన స్టార్క్
  • దీని వెనుక గంభీర్ హస్తం
  • తనకు కూడా ఇప్పించాలంటూ గంభీర్ ను వేడుకున్న జతిన్  
TV presenter request to Gambhir

ఐపీఎల్ మినీ వేలంలో ఆస్ట్రేలియా స్టార్ పేసర్ మిచెల్ స్టార్క్ అత్యధిక ధర పలికాడు. కోల్ కతా నైట్ రైడర్స్ ఆయనను రూ. 24.75 కోట్లకు కొనుగోలు చేసింది. స్టార్క్ కు రికార్డు ధర పలకడం వెనుక కోల్ కతా మెంటార్ గౌతమ్ గంభీర్ పాత్ర కూడా ఉంది. స్టార్క్ కోసం ఎన్ని కోట్లు పెట్టడానికైనా వెనుకాడొద్దని చెప్పిన వీడియో అందరూ చూశారు. మరోవైపు తాజాగా ఓ ఇంటర్వ్యూలో గంభీర్ కు ఆసక్తిర పరిణామం ఎదురయింది. స్టార్క్ కు కోట్లు కుమ్మరించిన విషయం గురించి గంభీర్ ను టీవీ ప్రజెంటర్ జతిన్ సప్రూ అడిగాడు. ఆ తర్వాత తనకు కూడా రెండు, మూడు కోట్లు ఇప్పించాలని గంభీర్ ను వేడుకున్నాడు. ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.

More Telugu News