Police: బుక్ మై షోపై చీటింగ్ కేసు నమోదు చేసిన మాదాపూర్ పోలీసులు

  • బుక్ మై షోతో పాటు సన్ బర్న్ షోపైనా చీటింగ్ కేసు
  • న్యూఇయర్ వేడుకలకు అనుమతి తీసుకోవాలని పోలీసుల సూచన
  • నిబంధనలు ఉల్లంఘిస్తే కఠిన చర్యలు ఉంటాయని హెచ్చరిక
Police file cheating case on book my show

బుక్ మై షోపై మాదాపూర్ పోలీసులు కేసు నమోదు చేశారు. సన్ బర్న్ ఈవెంట్‌కు బుక్ మై షోలో టిక్కెట్ల అంశంపై ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నిన్న ఆగ్రహం వ్యక్తం చేసిన విషయం తెలిసిందే. ఈ ఈవెంట్‌పై ముఖ్యమంత్రి ఆగ్రహం వ్యక్తం చేయడంతో బుక్ మై షో, సన్ బర్న్ నిర్వాహకులపై పోలీసులు కేసు నమోదు చేశారు. అనుమతి ఇవ్వకపోయినప్పటికీ ఆన్ లైన్‌లో టిక్కెట్లు విక్రయించడంపై బుక్ మై షోతో పాటు సన్ బర్న్ షోపై పోలీసులు చీటింగ్ కేసు నమోదు చేశారు. 2024 న్యూఇయర్ వేడుకలకు అనుమతి తీసుకోవాలని పోలీసులు ఇప్పటికే స్పష్టం చేశారు. నిబంధనలు ఉల్లంఘిస్తే కఠిన చర్యలు ఉంటాయని హెచ్చరించారు. ఈవెంట్‌కు సైబరాబాద్ పోలీసులు అనుమతి ఇవ్వకున్నా ఆన్ లైన్‌లో టిక్కెట్లు విక్రయించడం చర్చనీయాంశంగా మారింది. ఈవెంట్‌కు అనుమతుల్లేవని సైబరాబాద్ సీపీ అవినాశ్ మహంతి తెలిపారు.

More Telugu News