Konda Surekha: ఆరు గ్యారెంటీలను అమలు చేస్తాం: కొండా సురేఖ

  • ఈ నెల 31 నుంచి జనవరి 6 వరకు ప్రజాపాలన ఉంటుందన్న కొండా సురేఖ
  • ఈ ప్రజాపాలనలో ప్రజలు తమ సమస్యలు వెల్లడించాలని సూచన
  • అర్హులైన వారిని ఎంపిక చేసి ఆరు గ్యారెంటీలు అమలు చేస్తామన్న మంత్రి
Konda Surekha visits Sammakka Sarakka

కాంగ్రెస్ పార్టీ ఇచ్చిన ఆరు గ్యారెంటీలను క్రమంగా అమలు చేస్తామని, ఈ నెల 31వ తేదీ నుంచి జనవరి 6వ తేదీ వరకు జరిగే ప్రజాపాలనలో ప్రజలు తమ సమస్యలను విన్నవించుకోవాలని మంత్రి కొండా సురేఖ అన్నారు. సోమవారం నాడు ఉమ్మడి వరంగల్ జిల్లాలో మంత్రి సురేఖ సుడిగాలి పర్యటన జరిపారు. మేడారంలోని సమ్మక్క సారలమ్మ అమ్మవారిని దర్శించుకున్నారు. అక్కడ జాతర ఏర్పాట్లను ఆమె పరిశీలించారు. అనంతరం వరంగల్‌లోని ఓ చర్చిలో ప్రత్యేక ప్రార్థనలు చేశారు.

పర్యటన సందర్భంగా కొండా సురేఖ మాట్లాడుతూ... కాంగ్రెస్ పార్టీ ఇచ్చిన ఆరు గ్యారెంటీలను అమలు చేసే దిశగా ప్రజాపాలనను ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ప్రకటించారని గుర్తు చేశారు. ఈ నెల 31వ తేదీ నుంచి జనవరి 6వ తేదీ వరకు నిర్వహించే ప్రజాపాలన ద్వారా పేదలకు న్యాయం జరిగే విధంగా చర్యలు తీసుకుంటామన్నారు. కాబట్టి ప్రజలంతా వారి వారి డివిజన్లలో... వారి వారి గ్రామాల్లో తమ సమస్యలను ప్రభుత్వం దృష్టికి తీసుకు రావాలన్నారు. వాటిని ఆన్ లైన్ చేసి... వెరిఫికేషన్ చేసి.. అర్హులైన వారిని ఎంపిక చేసి ఆరు గ్యారెంటీలు అమలు చేస్తామన్నారు.

More Telugu News