Thar 700: రూ.700 లతో థార్ కొంటానన్న పిల్లాడు.. ఆనంద్ మహీంద్రా రియాక్షన్.. వీడియో ఇదిగో!

Anand Mahindra Reaction To Noida Boy Wants To Buy Thar For Rs 700
  • ఆ ధరకు అమ్మితే మేం దివాలా తీయాల్సిందేనంటూ ట్వీట్
  • సోషల్ మీడియాలో వైరల్ గా మారిన నోయిడా కుర్రాడి వీడియో
  • క్రిస్మస్ సందర్భంగా గిఫ్ట్ ఇవ్వాలంటున్న నెటిజన్లు

మహీంద్రా థార్ ను రూ.700 లతో కొనేస్తానంటూ తన తండ్రితో చెబుతున్న ఓ పిల్లాడి వీడియో సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. ఓ నెటిజన్ ట్యాగ్ చేయడంతో ఆనంద్ మహీంద్రా ఈ వీడియోపై స్పందించారు. వీడియోను రీట్వీట్ చేస్తూ.. ‘నువ్వు అన్నట్లు ఆ కారును రూ.700 లకు అమ్మితే మేం దివాలా తీయడానికి ఎక్కువ రోజులు పట్టదు’ అంటూ కామెంట్ పెట్టారు. దీంతో ఈ ట్వీట్ ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.

నోయిడాకు చెందిన చీకూ యాదవ్ అనే కుర్రాడు తన తండ్రితో మాట్లాడిన వీడియో ఇది. థార్ ఎక్స్ యూవీ 700 అంటే కారు ధర రూ.700 లని నమ్మిన చీకూ యాదవ్.. తన తండ్రి పర్స్ చూపిస్తూ డబ్బులివ్వాలని అడిగాడు. ఇద్దరమూ కలిసి వెళ్లి రూ.700 లతో థార్ తెచ్చుకుందామని చెప్పడం చూడొచ్చు. ఈ వీడియోను చూసిన ఆనంద్ మహీంద్రా.. చీకూ నీ వీడియో బాగుంది.. ఐ లవ్ చీకూ.. కానీ నువ్వు చెప్పిన ధరకు థార్ అమ్మితే మా కంపెనీ దివాలా తీయడానికి ఎక్కువ రోజులు అవసరం లేదు.. అంటూ ట్వీట్ చేశారు. వైరల్ గా మారిన ఈ ట్వీట్ పై కామెంట్లు వెల్లువెత్తుతున్నాయి. క్రిస్మస్ సందర్భంగా ఆ పిల్లాడికి శాంటా మారి, థార్ కారు ఇవ్వాలంటూ ఓ నెటిజన్ కామెంట్ పెట్టాడు.

  • Loading...

More Telugu News