Allu Arjun: చిరు సినిమాలో బాలనటుడిగా బన్నీ... ఇప్పటికీ తన రెమ్యునరేషన్ ఇవ్వలేదని వెల్లడి

  • చిరంజీవి హీరోగా గీతా ఆర్ట్స్ బ్యానర్లో 'విజేత' చిత్రం
  • 1985లో రిలీజైన చిత్రం
  • 'విజేత'లో శారద కొడుకుగా నటించిన అల్లు అర్జున్
Allu Arjun shares interesting fact

మెగాస్టార్ చిరంజీవికి నటుడిగా ఎంతో గుర్తింపు తెచ్చిన చిత్రాల్లో 'విజేత' ఒకటి. 1985లో ఈ చిత్రం విడుదలైంది. ఏ.కోదండరామిరెడ్డి దర్శకత్వంలో గీతా ఆర్ట్స్ బ్యానర్ పై అల్లు అరవింద్ ఈ చిత్రాన్ని నిర్మించారు. కాగా, 'విజేత' చిత్రంలో అల్లు అర్జున్ బాలనటుడిగా కనిపించారు. అందులో శారద కొడుకుగా నటించారు. అల్లు అర్జున్ కెమెరా ముందుకు వచ్చిన తొలి చిత్రం ఇదే. 

ఈ చిత్రానికి సంబంధించి తాజాగా ఓ ఫొటో పంచుకున్న అల్లు అర్జున్ ఆసక్తికర అంశాన్ని వెల్లడించారు. ఆ సినిమాలో తాను ఓ పాత్ర పోషించానని, కానీ తన తండ్రి అల్లు అరవింద్ ఆ సినిమాకు సంబంధించిన తన పారితోషికం ఇంకా ఇవ్వలేదని సరదాగా వ్యాఖ్యానించారు. కాగా, బన్నీ కమల్ హాసన్ నటించిన 'స్వాతిముత్యం' చిత్రంలోనూ బాలనటుడిగా తళుక్కుమన్నారు.

More Telugu News