Suryakumar Yadav: వాకింగ్ స్టిక్‌ సాయంతో నడుస్తున్న స్టార్ బ్యాటర్ సూర్యకుమార్ యాదవ్.. ఇన్‌స్టాగ్రామ్‌లో వీడియో

Star batter Suryakumar Yadav walking with the help of a walking stick shares Video on Instagram
  • కొంచెం సీరియస్ విషయమేనంటూ ఇన్‌స్టా వేదికగా వీడియో షేర్ చేసిన డాషింగ్ బ్యాటర్
  • త్వరలోనే ఫిట్‌నెస్‌తో తిరిగొస్తానని వెల్లడి
  • ఎడమ కాలి చీలమండపై ఒత్తిడి పడకుండా వాకింగ్ స్టిక్ ఉపయోగిస్తున్న సూర్య కుమార్ యాదవ్

చీలమండ గాయంతో బాధపడుతున్న టీమిండియా స్టార్ బ్యాట్స్‌మెన్ సూర్య కుమార్ యాదవ్‌ ప్రస్తుతం వాకింగ్ స్టిక్స్ సాయంతో నడుస్తున్నాడు. కాలిపై ఎలాంటి ఒత్తిడి పడకుండా ఈ మేరకు జాగ్రత్తలు తీసుకుంటున్నాడు. ఇందుకు సంబంధించిన వీడియోను ఇన్‌స్టాగ్రామ్ వేదికగా సూర్య షేర్ చేశాడు. గాయమైన ఎడమ కాలి చీలమండపై ఒత్తిడిని తగ్గించడానికి ఎడమ చేత్తో వాకింగ్ స్టిక్‌ పట్టుకొని నడుస్తున్నట్టు వీడియోలో కనిపించింది. ‘‘కొంచెం సీరియస్ విషయమే. గాయాలు ఎప్పటికీ సరదా కావు. అయినా సరే నేను ముందుకు నడుస్తాను. తక్కువ సమయంలో పూర్తి ఫిట్‌గా వెనక్కి తిరిగొస్తానని మాట ఇస్తున్నాను!. అప్పటి వరకు మీరంతా హాలిడే సీజన్‌ ఎంజాయ్ చేస్తారని, ప్రతిరోజూ చిన్న చిన్న ఆనందాలను ఆస్వాదిస్తారని ఆశిస్తున్నాను’’ అనే క్యాప్షన్ ఇచ్చిన సూర్య వీడియోను షేర్ చేశాడు. ఎడమ కాలి చీలమండపై మెడికల్ కట్లు కనిపించాయి. కాగా డిసెంబర్ 14న జోహన్నెస్‌బర్గ్‌లోని న్యూ వాండరర్స్ స్టేడియం వేదికగా జరిగిన భారత్ వర్సెస్ దక్షిణాఫ్రికా మధ్య 3వ టీ20 మ్యాచ్‌లో సూర్యకు చీలమండ గాయమైంది.

కాగా చీలమండ గాయం కారణంగా స్వదేశంలో ఆప్ఘనిస్థాన్‌తో జరగనున్న టీ20 సిరీస్‌కు సూర్యకుమార్ యాదవ్ దూరమవనున్నాడు. అంతకుముందు ఆస్ట్రేలియా, దక్షిణాఫ్రికాలతో జరిగిన టీ20 సిరీస్‌లకు టీమిండియా కెప్టెన్‌గా వ్యవహరించిన విషయం తెలిసిందే. ఇక ఆఫ్ఘనిస్థాన్‌తో ఆరంభం కానున్న షెడ్యూల్ విషయానికి వస్తే జనవరి 11న మొహాలీలో మొదటి టీ20 మ్యాచ్ జరగనుంది. జనవరి 14న ఇండోర్‌లో రెండవ, , జనవరి 17న బెంగళూరులో మూడవ టీ20 మ్యాచ్‌లు జరగనున్నాయి.

వీడియో కోసం క్లిక్ చేయండి

  • Loading...

More Telugu News