Prashant Kishor: చంద్రబాబును కలిసిన అనంతరం ప్రశాంత్ కిశోర్ స్పందన

Prashant Kishor responds on meeting with Chandrababu
  • నేడు చంద్రబాబుతో ప్రశాంత్ కిశోర్ భేటీ
  • దాదాపు 3 గంటల పాటు సమావేశం
  • చంద్రబాబును మర్యాదపూర్వకంగానే కలిశానన్న ప్రశాంత్ కిశోర్

టీడీపీ జాతీయ అధ్యక్షుడు చంద్రబాబును ప్రముఖ ఎన్నికల వ్యూహకర్త ప్రశాంత్ కిశోర్ కలవడం ఇవాళ మీడియాలో ప్రముఖంగా దర్శనమిచ్చింది. ప్రశాంత్ కిశోర్ ఓ నివేదికను చంద్రబాబుకు సమర్పించారంటూ కథనాలు వచ్చాయి. ఈ నేపథ్యంలో, ప్రశాంత్ కిశోర్ స్పందించారు. ఇవాళ తాను చంద్రబాబునాయుడిని కలవడం వెనుక ప్రత్యేక కారణం అంటూ ఏదీ లేదని స్పష్టం చేశారు. చంద్రబాబు సీనియర్ రాజకీయనాయకుడు అని, ఆయన కలవాలని కోరడంతో వచ్చానని వెల్లడించారు. ఆయనను మర్యాదపూర్వకంగానే కలిశానని వివరించారు.

  • Loading...

More Telugu News