Ruturaj Gaikwad: గాయంతో దక్షిణాఫ్రికాతో టెస్టు సిరీస్ కు దూరమైన రుతురాజ్ గైక్వాడ్

Ruturaj Gaikwad ruled out from test series with South Africa
  • దక్షిణాఫ్రికాతో రెండో వన్డే సందర్భంగా గైక్వాడ్ వేలికి గాయం
  • గాయం తీవ్రత కారణంగా టెస్టు జట్టు నుంచి తప్పించిన బీసీసీఐ
  • రుతురాజ్ గైక్వాడ్ స్థానాన్ని అభిమన్యు ఈశ్వరన్ తో భర్తీ చేసిన బోర్డు
టీమిండియా ఓపెనర్ రుతురాజ్ గైక్వాడ్ గాయంతో దక్షిణాఫ్రికాతో టెస్టు సిరీస్ మొత్తానికి దూరమయ్యాడు. దక్షిణాఫ్రికాతో రెండో వన్డేలో ఫీల్డింగ్ చేస్తున్నప్పుడు రుతురాజ్ కుడి చేతి వేలికి గాయమైంది. గాయం తీవ్రత దృష్ట్యా అతడికి స్కానింగ్ నిర్వహించారు. బీసీసీఐ వైద్య బృందం సిఫారసు మేరకు రుతురాజ్ గైక్వాడ్ ను జట్టు నుంచి తప్పించారు. బెంగళూరులోని జాతీయ క్రికెట్ అకాడమీలో రిపోర్టు చేయాలని రుతురాజ్ కు సూచించారు. ఇక, టీమిండియాలో రుతురాజ్ స్థానాన్ని అభిమన్యు ఈశ్వరన్ తో భర్తీ చేస్తున్నట్టు బీసీసీఐ ఓ ప్రకటన చేసింది.
Ruturaj Gaikwad
Injury
Test Series
Team India
South Africa

More Telugu News