Congress committee: చిదంబరం ఆధ్వర్యంలో 2024 ఎన్నికల కాంగ్రెస్ మేనిఫెస్టో కమిటీ

Chidambaram To Head Congresss Manifesto Committee For 2024 Polls
  • కాంగ్రెస్ చీఫ్ మల్లికార్జున ఖర్గే ప్రకటన
  • మొత్తం 16 మంది సభ్యులతో కమిటీ ఏర్పాటు
  • సభ్యులలో కర్ణాటక సీఎం సిద్ధరామయ్య, ప్రియాంక గాంధీ

తెలంగాణ అసెంబ్లీ ఎన్నికలలో సంచలన విజయం సాధించిన కాంగ్రెస్ పార్టీ.. 2024 లో జరిగే లోక్ సభ ఎన్నికలపై దృష్టి కేంద్రీకరించింది. ఈసారి ఎలాగైనా కేంద్రంలో ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయాలనే కృతనిశ్చయంతో పోరుకు సిద్ధమవుతోంది. ఇందులో భాగంగా పార్టీ సీనియర్ నేత, కేంద్ర మాజీ మంత్రి చిదంబరం నేతృత్వంలో 2024 ఎన్నికల మేనిఫెస్టో కమిటీని ఏర్పాటు చేసింది. మొత్తం 16 మంది సభ్యులతో కాంగ్రెస్ చీఫ్ మల్లికార్జున ఖర్గే ఈ కమిటీని ప్రకటించారు.

ఇందులో కర్ణాటక సీఎం సిద్ధరామయ్యతో పాటు పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి ప్రియాంక గాంధీ వాద్రా కూడా ఉన్నారు. లోక్ సభ ఎన్నికల కోసం కాంగ్రెస్ పార్టీ ఎజెండాను ఖరారు చేసే ఈ కమిటీలో కేంద్ర మాజీ మంత్రులు ఆనంద్ శర్మ, జైరాం రమేశ్, శశిథరూర్ లు కీలకంగా వ్యవహరించనున్నారు. ఆలిండియా ప్రొఫెషనల్స్ కాంగ్రెస్ చీఫ్ ప్రవీణ్ చక్రవర్తి, లోక్ సభలో పార్టీ డిప్యూటీ లీడర్ గౌరవ్ గొగోయ్, మణిపూర్ మాజీ డిప్యూటీ సీఎం గైఖాం గమ్ తదితరులు కూడా కమిటీలో ఉన్నారు.

  • Loading...

More Telugu News