Bigg Boss: బిగ్ బాస్-7 విజేత పల్లవి ప్రశాంత్‌కు షరతులతో కూడిన బెయిల్ మంజూరు

Big Boss Pallavi Prashanth gets bail
  • అన్నపూర్ణ స్టూడియోస్ వద్ద ఘటనలో కేసు నమోదు చేసి, అరెస్ట్ చేసిన పోలీసులు
  • బెయిల్ మంజూరు చేసిన నాంపల్లి కోర్టు
  • ఆదివారం పోలీసుల ముందు విచారణకు హాజరు కావాలని ఆదేశం

బిగ్ బాస్-7 తెలుగు విన్నర్ పల్లవి ప్రశాంత్‌కు బెయిల్ లభించింది. నాంపల్లి కోర్టు ఆయనకు షరతులతో కూడిన బెయిల్ మంజూరు చేసింది. ఆదివారం పోలీసుల ముందు విచారణకు హాజరు కావాలని ఆదేశించింది. అన్నపూర్ణ స్టూడియోస్ వద్ద విధ్వంసానికి ఆయనే కారణమనే అభియోగాలతో పోలీసులు అరెస్ట్ చేశారు. ప్రశాంత్ ను కోర్టులో ప్రవేశపెట్టడంతో 14 రోజుల రిమాండ్ విధించింది. దాంతో పోలీసులు ఆయనను చంచల్ గూడ జైలుకు తరలించారు. అయితే ఈ రోజు కోర్టు ఆయనకు బెయిల్ ఇచ్చింది. బిగ్ బాస్ విజేతగా పల్లవి ప్రశాంత్‌ను ప్రకటించిన అనంతరం అన్నపూర్ణ స్టూడియోస్ వద్ద అభిమానులు రెచ్చిపోయారు. ఈ ఘటనలో ఆరు బస్సులు, పోలీసు వాహనాలు ధ్వంసమయ్యయి. పలువురు పోలీసులకు కూడా గాయాలయ్యాయి. దీనికి సంబంధించి పోలీసులు కేసు నమోదు చేశారు.

  • Loading...

More Telugu News