Vin Diesel: హాలీవుడ్ స్టార్ విన్ డీసెల్ పై లైంగిక వేధింపుల ఆరోపణలు

Harassment allegations against Hollywood star Vin Diesel
  • ఫాస్ట్ అండ్ ఫ్యూరియస్ చిత్రాలతో అభిమానులను సంపాదించుకున్న విన్ డీసెల్
  • హోటల్లో తనను లైంగికంగా వేధించాడంటున్న మాజీ అసిస్టెంట్
  • విన్ డీసెల్ సోదరికి చెప్పినా పట్టించుకోలేదన్న మహిళ
  • తాజాగా లాస్ ఏంజెల్స్ కోర్టును ఆశ్రయించిన వైనం
ట్రిపులెక్స్, ఫాస్ట్ అండ్ ఫ్యూరియస్ చిత్రాలతో ప్రపంచవ్యాప్తంగా క్రేజ్ సంపాదించుకున్న నటుడు విన్ డీసెల్ పై అతడి మాజీ అసిస్టెంట్ జొనాసన్ సంచలన ఆరోపణలు చేసింది. విన్ డీసెల్ తనపై లైంగిక వేధింపులకు పాల్పడ్డాడని జొనాసన్ పేర్కొంది. ఈ మేరకు ఆమె లాస్ ఏంజెల్స్ కోర్టును ఆశ్రయించింది. 

2010లో 'ఫాస్ట్ ఫైవ్' సినిమా షూటింగ్ జరుగుతున్న సమయంలో విన్ డీసెల్ హోటల్ గదిలో తన పట్ల అసభ్యంగా ప్రవర్తించాడని, లైంగికంగా వేధించాడని వెల్లడించింది. అట్లాంటాలో షూటింగ్ జరుగుతున్న సమయంలో ఈ ఘటన చోటుచేసుకుందని జొనాసన్ వివరించింది.  

విన్ డీసెల్ ప్రవర్తనపై అతడి సోదరి సమంతా విన్సెంట్ కు తెలియజేశానని, కానీ ఆమె పట్టించుకోలేదని వాపోయింది. అంతేకాదు, ఆరోపణలు చేసిన కొద్ది సమయంలోనే తనను ఉద్యోగం నుంచి తొలగించారని వివరించింది.

హీరో విన్ డీసెల్ సోదరి సమంతా విన్సెంట్ 'వన్ రేస్' అనే సంస్థను నిర్వహిస్తోంది. ఈ సంస్థ ద్వారానే జొనాసన్ కు విన్ డీసెల్ అసిస్టెంట్ గా ఉద్యోగం వచ్చింది.
Vin Diesel
Harassment
Former Assistant
Hollywood
Los Angeles

More Telugu News