Ponnam Prabhakar: కాంగ్రెస్ తెలంగాణ ఇవ్వకుంటే రాష్ట్రం ఎలా వచ్చింది?: పొన్నం ప్రభాకర్

Ponnam Prabhakar questions brs about telangana
  • కాంగ్రెస్ తెలంగాణ ఇస్తేనే బీఆర్ఎస్ పదేళ్లు అధికారంలో ఉందన్న పొన్నం
  • పోడియం వద్ద గొడవ జరిగినా ఆనాడు కాంగ్రెస్ తెలంగాణ బిల్లు తెచ్చిందన్న పొన్నం ప్రభాకర్
  • రేవంత్ రెడ్డి బకాయిల గురించి మాట్లాడారు కానీ ప్రజలను అనలేదన్న పొన్నం
కాంగ్రెస్ పార్టీ తెలంగాణ ఇవ్వకుంటే మన రాష్ట్రం ఎలా వచ్చింది? అని హుస్నాబాద్ ఎమ్మెల్యే పొన్నం ప్రభాకర్ ప్రశ్నించారు. తెలంగాణ మేం ఇవ్వకుంటే ఇంకెవరు ఇచ్చారు? అన్నారు. విద్యుత్‌పై చర్చ సందర్భంగా పొన్నం మాట్లాడుతూ... కాంగ్రెస్ తెలంగాణ ఇస్తేనే బీఆర్ఎస్ పదేళ్లు అధికారంలో ఉందన్నారు. ఆ రోజు తాము ఎంపీలుగా తెలంగాణ కోసం పోరాడామన్నారు. మేం కొట్లాడకపోతే తెలంగాణ ఎక్కడిది? అన్నారు. పోడియం వద్ద గొడవ జరిగినా ఆనాడు కాంగ్రెస్ విభజన బిల్లు తెచ్చిందన్నారు. కానీ తెలంగాణ వచ్చాక పదేళ్లు అధికారంలో ఉన్న బీఆర్ఎస్ ఏం చేసిందన్నారు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సిద్దిపేట నుంచి బకాయిలు ఉన్నాయన్నారు కానీ, సిద్దిపేట ప్రజలను ఏమీ అనలేదని గుర్తు చేశారు.
Ponnam Prabhakar
Congress
BRS

More Telugu News