Chandrababu: మేరీమాత ఆలయంలో ప్రత్యేక ప్రార్థనలు చేసిన చంద్రబాబు దంపతులు

Chandrababu prayers in Gunadala Mary Matha temple
షార్ట్స్‌లో చూడండి
విజయవాడ గుణదలలో ఉన్న మేరీమాతను టీడీపీ అధినేత చంద్రబాబు, ఆయన భార్య భువనేశ్వరి దర్శించుకున్నారు. సెమీ క్రిస్మస్ వేడుకల్లో చంద్రబాబు దంపతులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా ప్రత్యేక ప్రార్థనలను నిర్వహించారు. చంద్రబాబు దంపతులతో పాటు వర్ల రామయ్య, దేవినేని ఉమా, జవహర్, అశోక్ బాబు, నాగుల్ మీరా, కొల్లు రవీంద్ర తదితరులు కూడా ప్రార్థనల్లో పాల్గొన్నారు. అంతకు ముందు విశాఖ నుంచి ఆయన విజయవాడకు చేరుకున్నారు. గన్నవరం విమానాశ్రయం వద్ద చంద్రబాబుకు టీడీపీ నేతలు ఘన స్వాగతం పలికారు. అనంతరం అక్కడి నుంచి మేరీమాత ఆలయానికి వెళ్లారు.
Go Back to Shorts
Chandrababu
Mary Matha
Gunadala
Telugudesam

More Telugu News