Dalit Bandhu: తెలంగాణలో దళితబంధుకు బ్రేకులు..! ప్రభుత్వానికి ఎస్సీ సంక్షేమ శాఖ లేఖ

  • విధానపరమైన స్పష్టత వచ్చే వరకూ పథకాన్ని నిలిపివేసిన ఎస్సీ సంక్షేమ శాఖ
  • రెండో విడతలో స్వీకరించిన దరఖాస్తు పరిశీలనపై స్పష్టత కోరుతూ ప్రభుత్వానికి లేఖ
  • ఇప్పటికే యూనిట్లు మంజూరైన వారి విషయంలోనూ స్పష్టత కోరిన వైనం
SC welfare department halts dalit bandhu as it awaits response from govt

తెలంగాణ రాష్ట్రంలో దళితబంధుకు బ్రేకులు పడ్డాయి. పథకానికి సంబంధించి రెండో విడత దరఖాస్తుల ప్రక్రియను ఎస్సీ సంక్షేమ శాఖ నిలిపివేసింది. ఈమారు 50 వేల దరఖాస్తులు వచ్చాయి. అయితే, నిధుల విడుదలపై విధానపరమైన స్పష్టత వచ్చే వరకూ ఎలాంటి నిర్ణయం తీసుకోకూడదని నిర్ణయించిన ఎస్సీ సంక్షేమ శాఖ ప్రభుత్వానికి లేఖ రాసింది. ఇప్పటికే దళిబంధు యూనిట్లు మంజూరై కొంత మొత్తం నగదు విడుదలైన వారికి మిగతా నిధులు విడుదల చేయాలా? వద్దా? అనే అంశంపైనా స్పష్టత కోరింది.  

దళిత బంధు పథకంపై మునుపటి ప్రభుత్వం రూ. 4,441.8 కోట్లు ఖర్చు చేసింది. ఒక్కో దళిత కుటుంబానికి రూ.10 లక్షలు మంజూరు చేసింది. తొలి విడతలో ఎంపికైన వారందరికీ నిధులు అందాయి. రెండో విడతగా నియోజకవర్గానికి 1,100 మంది చొప్పున సుమారు రూ.1.30 లక్షల కుటుంబాలకు పథకాన్ని అమలు చేయాలని గత ప్రభుత్వం లక్ష్యం విధించుకుంది. రెండో విడత కార్యక్రమంలో పైలట్ ప్రాజెక్టు కింద 400 మందిని ఎంపిక చేసి యూనిట్లు మంజూరు చేశారు.

More Telugu News