CM Revanth: సామాన్యుల వాహనాల మాదిరిగా సీఎం రేవంత్ కాన్వాయ్ ప్రయాణం

CM Revanth vehicle convoy journey like common people in Hyderabad
  • సాధారణ వాహనాల మాదిరిగా ప్రయాణించిన సీఎం రేవంత్ వాహన కాన్వాయ్
  • సైరన్ మోగించకుండా, ట్రాఫిక్ సిగ్నల్స్ పాటిస్తూ ప్రయాణించిన తెలంగాణ నూతన సీఎం
  • సోషల్ మీడియాలో వైరల్‌గా మారిన వీడియో
తన వాహన కాన్వాయ్ కారణంగా సామాన్య జనాలు ట్రాఫిక్ ఇబ్బందులు ఎదుర్కోకూడదని, దీనిని అధిగమించేందుకు పరిష్కారాలు చూపాలంటూ వారం రోజుల క్రితం పోలీసు శాఖ అధికారులను కోరిన సీఎం రేవంత్ రెడ్డి తన ఆలోచనను ఆచరణలోకి తీసుకొచ్చారు. సాధారణ వాహనాల మాదిరిగా ట్రాఫిక్ నిబంధనలను పాటిస్తూ ఆయన కాన్వాయ్ హైదరాబాద్‌లో బుధవారం ప్రయాణించింది. ఇందుకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. సాధారణ పౌరుల మాదిరిగానే రెగ్యులర్ ట్రాఫిక్‌లో సీఎం రేవంత్ రెడ్డి  వీఐపీ కాన్వాయ్ ప్రయాణించడం, ట్రాఫిక్ సిగ్నల్‌ను పాటిస్తూ కదిలి వెళ్లడం వీడియోలో కనిపించింది.  సైరన్ లేకుండా, ఎక్కడా ట్రాఫిక్ ఆపకుండా వెళ్లింది. నూతన సీఎం రేవంత్ రెడ్డి ప్రవేశపెట్టిన ఈ విధానం స్వాగతించదగినదని హైదరాబాద్ వాసులు కామెంట్ చేస్తున్నారు. వీఐపీ కల్చర్ లేదని ప్రశంసింస్తున్నారు.
CM Revanth
CM Revanth vehicle convoy
Telangana

More Telugu News