Yuvagalam Navasakam: యువగళం విజయోత్సవ సభ: పవన్ కల్యాణ్ కు స్వయంగా స్వాగతం పలికిన చంద్రబాబు

Chandrababu welcomes Janasena chief Pawan Kalyan at Polipalli meeting
  • పోలిపల్లిలో యువగళం విజయోత్సవ సభ
  • హాజరైన చంద్రబాబు, పవన్ కల్యాణ్
  • పక్కపక్కనే కూర్చున్న చంద్రబాబు, పవన్, లోకేశ్
టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేశ్ యువగళం పాదయాత్ర ముగిసిన నేపథ్యంలో, విజయనగరం జిల్లా పోలిపల్లిలో టీడీపీ యువగళం నవశకం సభ ఏర్పాటు చేసింది. ఈ విజయోత్సవ సభలో పాల్గొనేందుకు జనసేనాని పవన్ కల్యాణ్ కూడా విచ్చేశారు. 

ఈ సాయంత్రం విశాఖ ఎయిర్ పోర్టుకు చేరుకున్న పవన్ కల్యాణ్ అక్కడి నుంచి రోడ్డు మార్గంలో పోలిపల్లి వచ్చారు. యువగళం విజయోత్సవ సభా ప్రాంగణం వద్ద పవన్ కల్యాణ్ కు టీడీపీ అధినేత చంద్రబాబు, బాలకృష్ణ తదితరులు స్వాగతం పలికారు. పవన్ కల్యాణ్ ను వారు సభా వేదిక వద్దకు తీసుకువచ్చారు. పవన్ రాకతో సభలో ఉన్న జనసేన పార్టీ శ్రేణుల కోలాహలం మిన్నంటింది.

ఇక, వేదికపై చంద్రబాబు, పవన్ కల్యాణ్, నారా లోకేశ్, బాలకృష్ణ పక్కపక్కనే కూర్చున్నారు. చంద్రబాబుకు మరోవైపున అచ్చెన్నాయుడు, నందమూరి బాలకృష్ణ తదితరులు కూర్చున్నారు.
Yuvagalam Navasakam
Polipalli
Chandrababu
Pawan Kalyan
Nara Lokesh
TDP
Janasena
Andhra Pradesh

More Telugu News