Nara Lokesh: చిలకలూరిపేటలో చెల్లని మంత్రి గుంటూరులో గెలుస్తారా?: నారా లోకేశ్

Nara Lokesh comments on YCP
  • ముగిసిన యువగళం పాదయాత్ర
  • వరుసగా ఇంటర్వ్యూలు ఇస్తున్న నారా లోకేశ్
  • వచ్చే ఎన్నికల్లో గెలిచేది టీడీపీ-జనసేన కూటమి అని స్పష్టీకరణ
  • వైసీపీ ప్రతిపక్షంలో కూర్చున్నాక ఇక యుద్ధమేనని వ్యాఖ్యలు
యువగళం పాదయాత్ర ముగిశాక నారా లోకేశ్ వరుసగా మీడియా సంస్థలకు ఇంటర్వ్యూలు ఇస్తున్నారు. తాజాగా ఓ మీడియా ప్రతినిధితో మాట్లాడుతూ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. 

వచ్చే ఎన్నికల్లో గెలిచేది టీడీపీ-జనసేన కూటమి అని స్పష్టం చేశారు. అప్పుడు తమది అధికార పక్షం అవుతుందని, వైసీపీ విపక్షంలో ఉంటుందని అన్నారు. ప్రధాన ప్రతిపక్షంలో ఉండే వైసీపీతో తమకు యుద్ధమేనని, అందులో ఎలాంటి సందేహం లేదని తెలిపారు. అయితే, వారిపై ఎలాంటి కక్ష సాధింపులు ఉండవని నారా లోకేశ్ స్పష్టం చేశారు. రాజకీయాలతో సంబంధం లేని వ్యక్తులపై తాము ఎప్పుడూ ఆధారాలు లేకుండా ఎలాంటి ఆరోపణలు చేయలేదని పేర్కొన్నారు. 

"పాదయాత్రలో నేను కూడా అధికార పార్టీ ఎమ్మెల్యేలపై అనేక ఆరోపణలు చేశాను. అందుకే ఆ ఎమ్మెల్యేలను ఆ నియోజకవర్గానికి, ఈ నియోజవర్గానికి మార్చేస్తున్నారు. అటు వాళ్లను ఇటు, ఇటు వాళ్లను అటు రీషఫుల్ చేస్తున్నారు. మనింట్లో చెత్తను తీసుకెళ్లి పక్కింటి ముందు పడేస్తే బంగారం అవదు కదా స్వామీ! ఈ నియోజకవర్గంలో చెత్త అని ముఖ్యమంత్రే ఒప్పుకుంటున్నాడు... పక్క నియోజకవర్గానికి వెళితే సమర్థులు ఎలా అవుతారు? చిలకలూరిపేటలో ఒక మంత్రి యూస్ లెస్ అని ముఖ్యమంత్రే తేల్చితే... ఈ మంత్రి గుంటూరుకు వచ్చి ఏం లాభం? అనేక నియోజకవర్గాల్లో ఇదే జరిగింది... జరుగుతున్నాయి. ఇలా ఎమ్మెల్యేలను అటూ ఇటూ మార్చడం చూసి ప్రజలే నవ్వుకుంటున్నారు" అంటూ లోకేశ్ వ్యంగ్యం ప్రదర్శించారు.
Nara Lokesh
TDP
Janasena
YSRCP
Andhra Pradesh

More Telugu News