ఈ నెల 28 నుంచే రూ.500 కు గ్యాస్
- మహాలక్ష్మి పథకం కింద అందజేస్తామన్న ప్రభుత్వం
- కాంగ్రెస్ పార్టీ ఆవిర్భావ దినోత్సవ కానుకగా ఏర్పాట్లు
- గైడ్ లైన్స్ సిద్ధం చేస్తున్న సివిల్ సప్లై శాఖ అధికారులు
అధికార గణాంకాల ప్రకారం.. తెలంగాణలో 1.20 కోట్ల గ్యాస్ కనెక్షన్లు ఉన్నాయి. నెల నెలా 60 లక్షల సిలిండర్లు సరఫరా అవుతున్నాయి. రాష్ట్రంలోని గ్యాస్ వినియోగదారులు అందరికీ సబ్సిడీ ఇస్తే ఖజానాపై ఏటా రూ.3 వేల కోట్ల భారం పడనుందని అంచనా. అయితే, రాష్ట్రంలో మహిళల పేరుతో ఉన్న కనెక్షన్లు సుమారుగా 70 లక్షలు ఉన్నాయి. ఈ నేపథ్యంలో మహిళల పేరుతో ఉన్న కనెక్షన్లకే సబ్సిడీ ఇవ్వాలని ప్రభుత్వం నిర్ణయించే అవకాశం ఉందని తెలుస్తోంది. అయితే, గ్యాస్ కనెక్షన్ కు సంబంధించి ‘నేమ్ ఛేంజ్’ ఆప్షన్ ఉండడంతో మిగతా వినియోగదారులు పేరు మార్చుకునే సౌలభ్యం ఉంది. ఈ క్రమంలోనే గ్యాస్ సబ్సిడీకి సంబంధించి గైడ్ లైన్స్ రూపొందించేందుకు అధికారులు కసరత్తు చేస్తున్నారు.