Rashmika Mandanna: రష్మిక డీప్‌ఫేక్ వీడియో కేసులో నలుగురి అరెస్ట్.. పరారీలో ఉన్న అసలు నిందితుడి కోసం గాలింపు

4 Arrested in Actress Rashmika Mandanna deepfake video case
  • అరెస్ట్ చేసిన ఢిల్లీ పోలీసులు
  • రష్మిక వీడియోను అప్‌లోడ్ చేసింది ఈ నలుగురే అని గుర్తింపు
  • దేశవ్యాప్తంగా కలకలం రేపిన రష్మిక డీప్‌ఫేక్ వీడియో
సోషల్ మీడియాలో సంచలనం సృష్టించిన సినీనటి రష్మిక మందన్న డీప్‌ఫేక్ వీడియో కేసులో ఢిల్లీ పోలీసులు నలుగురు నిందితులను అరెస్ట్ చేశారు. ఈ నలుగురే ఆ వీడియోను సోషల్ మీడియాలో అప్‌లోడ్ చేసినట్టు గుర్తించారు. పరారీలో ఉన్న అసలు నిందితుడి కోసం గాలిస్తున్నారు. 

ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ (ఏఐ) సాయంతో ప్రముఖుల డీప్‌ఫేక్ వీడియోలు సృష్టిస్తూ జనాలపైకి వదులుతున్న ఘటనలు ఇటీవలి కాలంలో బాగా ఎక్కువయ్యాయి. రష్మిక వీడియో సృష్టించిన కలకలం అంతాఇంతా కాదు. ఈ డీప్‌ఫేక్ వీడియోపై చిత్రపరిశ్రమలన్నీ స్పందించాయి. ఇది ఆందోళన కలిగించే అంశమని, నిందితులపై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశాయి. కేంద్రం కూడా ఈ ఘటనను తీవ్రంగా పరిగణించింది. ఈ నేపథ్యంలో కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించిన ఢిల్లీ పోలీసులు తాజాగా నలుగురు నిందితులను అదుపులోకి తీసుకున్నారు.
Rashmika Mandanna
Deepfake Video
Deepfake Technology
Bollywood

More Telugu News