Harish Rao: మేం కూడా ఇస్తాం పవర్ పాయింట్ ప్రజంటేషన్.. స్పీకర్‌ను అనుమతి కోరిన హరీశ్‌రావు

Harish Rao want to give power point presentation in assembly
  • రాష్ట్ర ఆర్థిక స్థితిగతులు, సాగునీరు, విద్యుత్ అంశాలపై ప్రభుత్వం పవర్ పాయింట్ ప్రజంటేషన్
  • తమ వెర్షన్ వినిపించేందుకు కూడా అనుతించాలన్న సిద్దిపేట ఎమ్మెల్యే
  • స్పీకర్‌కు వినతిపత్రం అందజేత
అసెంబ్లీలో పవర్ పాయింట్ ప్రజంటేషన్ ద్వారా రాష్ట్ర ఆర్థిక పరిస్థితిని వివరించడంతోపాటు గత ప్రభుత్వం చేసిన అప్పుల గురించి సవివరంగా వివరించేందుకు కాంగ్రెస్ ప్రభుత్వం సిద్ధమవుతున్న నేపథ్యంలో ప్రతిపక్ష బీఆర్ఎస్ కూడా అందుకు రెడీ అవుతోంది. తమకు కూడా పవర్ పాయింట్ ప్రజంటేషన్‌కు అవకాశం ఇవ్వాలని స్పీకర్ ప్రసాద్‌కుమార్‌కు మాజీ మంత్రి, సిద్దిపేట ఎమ్మెల్యే హరీశ్‌రావు విజ్ఞప్తి చేశారు. 

మంగళవారం స్పీకర్‌ను కలిసిన ఆయన ఈ మేరకు వినతిపత్రం సమర్పించారు. నేటి అసెంబ్లీ సమావేశాల్లో ప్రభుత్వం ఆర్థిక, సాగునీటి, విద్యుత్ అంశాలపై పవర్ పాయింట్ ప్రజంటేషన్ ఇవ్వనుంది. ఈ నేపథ్యంలో తమ వెర్షన్ కూడా వినిపించేందుకు అవకాశం ఇవ్వాలని హరీశ్‌రావు కోరారు.
Harish Rao
BRS
Congress
Power Point Presentaion

More Telugu News