LK Advani: రామ మందిర ప్రారంభోత్సవానికి అద్వానీ, జోషీలకు ఆహ్వానం

LK Advani and MM Joshi invited for Ayodhya Ram Mandir opening ceremony
  • అద్వానీ, జోషీలను ఆహ్వానించిన వీహెచ్పీ అంతర్జాతీయ వర్కింగ్ ప్రెసిడెంట్
  • హాజరయ్యేందుకు ప్రయత్నిస్తామన్న ఇద్దరు నేతలు
  • జనవరి 22న రామాలయం ప్రారంభోత్సవం
బీజేపీ కురువృద్ధులు అద్వానీ, మురళీ మనోహర్ జోషీల ఆరోగ్యాన్ని దృష్టిలో పెట్టుకుని వారిని అయోధ్య రామాలయం ప్రారంభోత్సవానికి రావద్దని కోరామని శ్రీరామ జన్మభూమి తీర్థ క్షేత్ర ట్రస్ట్ వెల్లడించిన సంగతి తెలిసిందే. తమ వినతిని ఇద్దరూ అంగీకరించారని చెప్పిన సంగతి విదితమే. ఈ అంశం దేశ వ్యాప్తంగా చర్చనీయాంశంగా మారింది. దీని వెనుక ఏదో ఉందని పలువురు అనుమానాలు వ్యక్తం చేశారు. ఈ నేపథ్యంలో అద్వానీ, జోషీలకు విశ్వహిందూ పరిషత్ ఆహ్వానం పలికింది. విశ్వహిందూ పరిషత్ అంతర్జాతీయ కార్యనిర్వాహక అధ్యక్షుడు అలోక్ కుమార్ వీరిని స్వయంగా కలిసి ఆహ్వానం పలికారు. మరోవైపు, రామాలయం ప్రారంభోత్సవానికి హాజరయ్యేందుకు ప్రయత్నిస్తామని ఇద్దరు నేతలు చెప్పినట్టు సమాచారం. జనవరి 22న రామాలయం ప్రారంభోత్సవం జరగనుంది.
LK Advani
MM Joshi
Ayodhya Ram Mandir
VHP

More Telugu News