Teja Sajja: 'హను మాన్' సంక్రాంతికి రావడమే కరెక్టు: దర్శకుడు ప్రశాంత్ వర్మ

  • తేజ సజ్జ హీరోగా రూపొందిన 'హను మాన్'
  • కంటెంట్ పరంగా పెద్ద సినిమా అని వ్యాఖ్య 
  • అన్ని వయసుల వారికీ నచ్చుతుందని వెల్లడి 
  • జనవరి 12వ తేదీన సినిమా విడుదల

Hanu Man Movie Update

తేజ సజ్జ హీరోగా ప్రశాంత్ వర్మ 'హను మాన్' సినిమాను రూపొందించాడు. నిరంజన్ రెడ్డి నిర్మించిన ఈ సినిమా, సంక్రాంతి కానుకగా జనవరి 12వ తేదీన ప్రేక్షకుల ముందుకు రానుంది. ఈ నేపథ్యంలో ఈ సినిమా నుంచి ట్రైలర్ ను వదిలారు. ట్రైలర్ లాంచ్ ఈవెంటులో ప్రశాంత్ వర్మ మాట్లాడాడు.  

"చాలా  చిన్న సినిమా చేద్దామని ఈ కంటెంట్ తో సెట్స్ పైకి వెళ్లాము. అయితే ఆ తరువాత ఈ ప్రాజెక్టుకి వచ్చిన రెస్పాన్స్ ను చూసి, ఇంకాస్త పెద్ద సినిమాగానే చేద్దామని నిరంజన్ రెడ్డిగారు అన్నారు. అలా ఈ సినిమా ఇంకాస్త ముందుకు వెళ్లింది. ఇప్పటికీ కూడా బడ్జెట్ పరంగా ఈ సినిమా చిన్నదే అనిపించినా, కంటెంట్ పరంగా పెద్ద సినిమానే అని చెప్పాలి" అన్నాడు. 

'సంక్రాంతికి పెద్ద సినిమాలు రావాలి .. మీది చాలా చిన్న సినిమా కదా' అని కొంతమంది అంటున్నారు. ఈ సినిమాలో అన్ని వయసుల వారికి వినోదాన్ని పంచే అంశాలు ఉన్నాయి. అందువలన ఈ సినిమాను సంక్రాంతికి రిలీజ్ చేయడమే కరెక్టు అని మేము చాలా రోజుల క్రితమే అనుకున్నాము .. అలాగే వస్తున్నాము. తెలుగులో 400 థియేటర్స్ లో ఈ సినిమాను రిలీజ్ చేస్తున్నాము. హిందీలో 1500 థియేటర్స్ లో రిలీజ్ చేస్తుండటం విశేషం" అని చెప్పాడు. 

More Telugu News