Medigadda Dam: మేడిగడ్డ డ్యామ్ పూర్తి వివరాలు ఇవ్వండి: హైకోర్టు ఆదేశం

TS High court orders to submit all details of Medigadda dam
  • కుంగిన మేడిగడ్డ ప్రాజెక్టు పిల్లర్లు
  • సీబీఐ చేత విచారణ జరిపించాలంటూ హైకోర్టులో పిటిషన్
  • తదుపరి విచారణను రెండు వారాలకు వాయిదా వేసిన హైకోర్టు
మేడిగడ్డ బ్యారేజ్ పిల్లర్లు కుంగిపోవడం సంచలనం రేపిన సంగతి తెలిసిందే. ఈ అంశంపై సీబీఐతో విచారణ జరిపించాలని కోరుతూ కాంగ్రెస్ నేత నిరంజన్ తెలంగాణ హైకోర్టులో పిటిషన్ వేశారు. మహాదేవపురం పోలీస్ స్టేషన్ లో నమోదైన కేసును సీబీఐకి బదిలీ చేయాలని పిటిషన్ లో ఆయన పేర్కొన్నారు. ఈ పిటిషన్ ను హైకోర్టు ఈరోజు విచారించింది. చీఫ్ సెక్రటరీ నుంచి సమాచారం తీసుకుని తమకు సమర్పించాలని ప్రభుత్వాన్ని హైకోర్టు ఆదేశించింది. రెండు వారాల్లో పూర్తి వివరాలను సమర్పించాలని ప్రభుత్వం తరపు న్యాయవాదులకు ఆదేశాలు జారీ చేసింది. తదుపరి విచారణను రెండు వారాలకు వాయిదా వేసింది.
Medigadda Dam
TS High Court

More Telugu News