Chandrababu: ఇసుక పాలసీ కేసు: చంద్రబాబు ముందస్తు బెయిల్ పిటిషన్ పై విచారణ వాయిదా

High Court adjourns Chandrababu anticipatory bail plea hearing
  • గత ప్రభుత్వ హయాంలో ఇసుక అక్రమాలు జరిగాయంటున్న సీఐడీ
  • చంద్రబాబుపై కేసు నమోదు 
  • ముందస్తు బెయిల్ కోసం చంద్రబాబు పిటిషన్
గత ప్రభుత్వ హయాంలో ఇసుక విధానంలో అనేక అక్రమాలు జరిగాయంటూ ఏపీ సీఐడీ విపక్ష నేత చంద్రబాబుపై కేసు నమోదు చేయడం తెలిసిందే. అప్పటి ప్రభుత్వ నిర్ణయాల వల్ల రాష్ట్ర ఖజానాకు భారీ నష్టం వాటిల్లిందని సీఐడీ పేర్కొంటోంది. ఈ కేసులో చంద్రబాబు ముందస్తు బెయిల్ కోరుతూ ఏపీ హైకోర్టును ఆశ్రయించారు. ఈ పిటిషన్ పై హైకోర్టులో నేడు లంచ్ బ్రేక్ తర్వాత విచారణ జరిగింది. తదుపరి విచారణను హైకోర్టు రేపటికి వాయిదా వేసింది. 
Chandrababu
Anticipatory Bali Plea
Sand Policy Case
AP High Court
CID
TDP
Andhra Pradesh

More Telugu News