Budda Venkanna: కొడాలి నాని వంటి వాళ్లు నోరు అదుపులో పెట్టుకోవాలి: బుద్దా వెంకన్న

YSRCP leaders like Kodali Nani has to control their tongue says Budda Venkanna
  • చంద్రబాబు, పవన్ ల భేటీపై వైసీపీ నేతల విమర్శలు
  • ఇద్దరూ కలిస్తే మీకెందుకు భయమని బుద్దా వెంకన్న ప్రశ్న
  • మూడు నెలలు పోతే అందరి నోళ్లు మూతపడతాయని వ్యాఖ్య
టీడీపీ అధినేత చంద్రబాబు, జనసేన అధినేత పవన్ కల్యాణ్ సమావేశం కావడంపై వైసీపీ నేతలు విమర్శలు గుప్పిస్తున్న సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో టీడీపీ నేత బుద్దా వెంకన్న మాట్లాడుతూ వైసీపీ నేతలపై విరుచుకుపడ్డారు. చంద్రబాబు, పవన్ కలిస్తే మీకెందుకు భయమని ప్రశ్నించారు. ఇలానే మాట్లాడితే మీకు బడితె పూజ తప్పదని హెచ్చరించారు. మరో మూడు నెలలు ఆగితే...  ఇప్పుడు వాగుతున్న వారందరి నోళ్లు మూతపడతాయని చెప్పారు. 

కొడాలి నాని వంటి వాళ్లు నోరు అదుపులో పెట్టుకోవాలని వెంకన్న అన్నారు. లేకపోతే వీరికి బుద్ధి వచ్చేలా టీడీపీ కేడర్ సమాధానం చెపుతుందని హెచ్చరించారు. మూడు నెలల తర్వాత వీరికి గన్ మెన్లు కూడా ఉండరని అన్నారు. టీడీపీ, జనసేనలు పొత్తులో ఉన్నాయని... ఈ విషయం తెలుసుకుని వైసీపీ నేతలు మాట్లాడాలని చెప్పారు. నారా లోకేశ్ డైరీలో ఇప్పటికే కొందరి పేర్లు ఉన్నాయని... మరికొన్ని పేర్లు కూడా డైరీలోకి ఎక్కుతాయని అన్నారు.
Budda Venkanna
Telugudesam
Chandrababu
Pawan Kalyan
Janasena
Kodali Nani
YSRCP

More Telugu News